BigTV English

Manchu Manoj : క‌లిసొచ్చే కాలానికి న‌డిచొచ్చే కొడుకొచ్చాడంతే.. మంచు మ‌నోజ్ కామెంట్స్ వైర‌ల్‌

Manchu Manoj : క‌లిసొచ్చే కాలానికి న‌డిచొచ్చే కొడుకొచ్చాడంతే.. మంచు మ‌నోజ్ కామెంట్స్ వైర‌ల్‌
Manchu Manoj

Manchu Manoj : మంచు మ‌నోజ్, భూమా మౌనికల వివాహం మార్చి 3న జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రి 12 ఏళ్ల ప‌రిచ‌యం ఉంది. 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్ద‌రికీ ఇది రెండో వివాహ‌మే. మౌనిక ఇప్ప‌టికే ఓ కొడుకు ఉన్నాడు. పెళ్లి త‌ర్వాత మౌనిక‌, ఆమె కొడుకు బాధ్య‌త‌ను తానే తీసుకుంటున్న‌ట్లు మ‌నోజ్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. సోమ‌వారం రోజున మ‌నోజ్ కుటుంబంతో కలిసి తిరుమ‌ల‌కు వెళ్లారు. ద‌ర్శ‌నం అనంత‌రం అక్క‌డి మీడియాతో మాట్లాడుతూ ‘‘నా ప్రేమ గెలిచింది. ప్రేమ ఎప్ప‌టికైనా గెలుస్తుంది. మీ అంద‌రి ఆశీర్వాదాలు మాకు అందాయి. ఇక శివుడు ఆజ్ఞ గురించి చెప్పాలంటే వీరిద్ద‌రినీ నాకు శివుడే అప్ప‌గించాడు. అంతా శివుడి ఆజ్ఞ‌.. నేను చేసిందేమీ లేదు. కలిసొచ్చే కాలానికి న‌డిచొచ్చే కొడుకు వ‌చ్చాడు. నేను వారిని బాగా చూసుకోవాలంతే.


నేను, మౌనిక ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌ని అనుకుంటున్నాం. ప్ర‌స్తుతం నేను సినిమాల‌తో బిజీగా ఉన్నాను. త్వ‌ర‌లోనే వాట్ ది ఫిష్ సినిమా పూర్త‌వుతుంది’’ అని తెలిపారు మ‌నోజ్‌. మంచు హీరో చేసిన ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. వీరి పెళ్లిని హైద‌రాబాద్‌లోని ల‌క్ష్మీ మంచు ఇంట్లో నిర్వ‌హించారు. కుటుంబ స‌భ్యుల‌తో పాటు బంధు మిత్రులంద‌రూ వ‌చ్చారు. వివాహం అనంతం మ‌నోజ్, మౌనిక క‌ర్నూలుకి వెళ్లి మంత్రి రామ సుబ్బారెడ్డిని క‌లిశారు. ఆళ్ల‌గ‌డ్డ‌కు వెళ్లి భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి స‌మాధుల‌ను ద‌ర్శించి నివాళులు అర్పించారు.

చానాళ్ల వ‌రకు సినీ రంగానికి దూరంగా ఉంటూ వ‌చ్చిన మనోజ్ ఈ మ‌ధ్య‌నే వాట్ ది ఫిష్ సినిమాను అనౌన్స్ చేశారు. మ‌రి నెక్ట్స్ సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూడాలి. మ‌రో వైపు మంచు మ‌నోజ్ చేసిన కామెంట్స్ వింటుంటే ఆయ‌న పాలిటిక్స్ వైపు చూస్తున్నార‌ని స్ప‌ష్టంగా తెలుస్తుంది.


Related News

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Big Stories

×