BigTV English
Advertisement

Google Vs Apple : ఆ ఇంజనీర్లకు గూగుల్ వల.. AIలో దూకుడు.. యాపిల్ కు షాక్.. ఏం జరిగింది..?

Google Vs Apple : ఆ ఇంజనీర్లకు గూగుల్ వల.. AIలో దూకుడు.. యాపిల్ కు షాక్.. ఏం జరిగింది..?


Google Vs Apple : భవిష్యత్ ను కృత్రిమ మేధస్సు .. AI శాసిస్తుంది. ఈ రంగానికే బూమ్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా AI నైపుణ్యం కలిగిన నిపుణులు కొరత తీవ్రంగా ఉంది. అందుకే టెక్ కంపెనీల మధ్య ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పోటీని పెంచింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు పెద్ద టెక్ కంపెనీలు రేసులో ముందు వరుసలో ఉన్నాయి. భారత్ కు చెందిన ఇద్దరు ఇంజనీర్ల కోసం గూగుల్ , ఆపిల్ మధ్య పెద్ద ఇష్యూ నడిచిన విషయం వెలుగులోకి వచ్చింది.

ఆపిల్ సెర్చ్ టెక్నాలజీని ఆధునీకరించడంలో శ్రీనివాసన్ వెంకటాచారి, స్టీవెన్ బేకర్ , ఆనంద్ శుక్లా అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కీలకపాత్ర పోషించారు. సిరి, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. మైక్రోసాఫ్ట్ నిధులతో పనిచేసే చాట్ జీపీటీ లాంటి చాట్‌బాట్‌ల వెనుక ఉన్న ఇంటర్నల్ టెక్నాలజీని, పెద్ద-భాష మోడల్‌లను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టడానికి గతేడాది గూగుల్ లో చేరారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ ముగ్గురిని తన కంపెనీలో చేరమని వ్యక్తిగతంగా ఆకర్షించారనేది ఆరోపణ. అయితే ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ వారిని తన సంస్థలోనే పనిచేసేలా ఒప్పించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇదే ఇప్పుడు ఇష్యూగా మారింది.


ఆనంద్ శుక్లా IIT కాన్పూర్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చేశారు. ఆ తర్వాత ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించారు. 2001 నుంచి శుక్లా గూగుల్‌లో 12 ఏళ్లుగా పనిచేశారు. ఆ తర్వాత అతను వెంకటాచారి, స్టీవెన్ బేకర్‌తో కలిసి లేజర్‌లైక్ ఇంక్ అనే కంపెనీని స్థాపించారు. ఈ సంస్థను ఆపిల్ కొనుగోలు చేసింది. దీంతో వీరు 2018లో ఆపిల్‌లో చేరారు. అయితే గతేడాది నవంబర్‌లో గూగుల్‌కి తిరిగి వచ్చారు.

వెంకటాచారి 1996లో మద్రాస్ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు. ఆ తర్వాత సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. శుక్లా లాగే వెంకటాచారి కెరీర్ ఆరేళ్లు గూగుల్‌లోనే సాగింది. ఆ తర్వాత గత అక్టోబర్‌లో ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా గూగుల్ కు తిరిగి రావడానికి ముందు ఆపిల్ సంస్థలో నాలుగేళ్లు పని చేశారు. స్టీవెన్ బేకర్ కూడా ఆపిల్‌ను నుంచి వచ్చి వెంకటాచారి, శుక్లాతో కలిసి గూగుల్‌ లో చేరారు. వారు తిరిగి గూగుల్ కు వెళ్లడంతో ఆపిల్ కు భారీ దెబ్బ తగిలింది.

ఈ ఇంజనీర్లు బయటకురావడంతో ఆపిల్ వెనుకబడింది. గూగుల్ మాత్రం తన ఏఐ బార్డ్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఓపెన్ ఏఐ చాట్ జీపీటీలో పెట్టుబడులు పెట్టి రేసులో దూసుకుపోతోంది. బింగ్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉత్పత్తుల్లో సైతం ఏఐను అనుసంధానించాలని చూస్తోంది. వ్యాసాలు, ప్రసంగాలు, పరీక్షా పత్రాలను సెకన్లలో రూపొందించగల సామర్థ్యంతో వెబ్ యూజర్లను చాట్ జీపీటీ ఆకర్షించిన తర్వాత గూగుల్ AI స్పేస్‌లోకి దూసుకుపోతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో గూగుల్ చాట్‌బాట్ సర్వీస్ బార్డ్‌ను ప్రారంభించింది.

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×