BigTV English

Lawsonia Inermis :- తెల్లజుట్టును నల్లగా మార్చే ఆకు ఇది

Lawsonia Inermis :- తెల్లజుట్టును నల్లగా మార్చే ఆకు ఇది


Lawsonia Inermis :– ప్రస్తుతం ప్రతి ఒక్కరూ జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వాయు కాలుష్యంతో పాటు ఆహారపు అలవాట్లు, లైఫ్‌స్టైల్‌, ఒత్తిడి కారణంగా జుట్టు సమస్యలు తలెత్తుతున్నాయి. జుట్టు సరిగా పెరగకపోవడం, చిట్లడం, అతిచిన్న వయసులోనే తెల్లబడటం, అధిక చుండ్రులాంటి సమస్యలు వస్తున్నాయి. కెమికల్‌ షాంపూలు వాడి ఇంకా రోగాల బారిన పడుతున్నారు. అందుకే ఆయుర్వేదంలో జుట్టు సమస్యలకు చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. గోరింటాకు.. దీన్ని ఆయుర్వేదంలో ఒక ఔషధంగా వాడుతారు. జుట్టు సంబంధిత సమస్యలకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. సాధారంగా గోరింటాకును చేతికి పెట్టుకుంటారు. కానీ జుట్టు సమస్యలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. చాలా మంది తెల్లజుట్టును నల్లగా మార్చుకునేందుకు తలకు పెట్టుకుంటూ ఉంటారు. ఎక్కువశాతం మంది గోరింటాకును మెత్తగా చేసి వెంటనే తలకు పట్టిస్తుంటారు. అలా చేయడంతో ఫలితం తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలా కాకుండా గోరింటాకును మెత్తగా చేసి ఒక రాత్రంతా ఇనుప గిన్నెలో ఉంచి ఉదయాన్నే తలకు పెట్టుకోవాలి, ఇలా క్రమం తప్పకుండా చేస్తే తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి. గోరింటాకు రసాన్ని కూడా తలకు పెట్టుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా చుండ్రు సమస్య కూడా తగ్గిపోతుంది. జుట్టు చిట్లడం కూడా తగ్గి కాంతివంతంగా తయారవుతుంది. కేవలం జుట్టుకే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలను నయం చేయడంలో కూడా గోరింటాకు చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. ఫంగ‌ల్ ఇన్ఫెక్షన్‌ వల్ల గోర్లు పుచ్చిపోతే గోరింటాకును పేస్ట్‌లా చేసుకుని ఆ గోరు మీద ఉంచడం వల్ల తొందరగా తగ్గిపోతుంది. అలాగే అరికాళ్ల మంట‌ల‌ను త‌గ్గించ‌డంలో కూడా గోరింటాకు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనిని మెత్తగా చేసి అరికాళ్లకు రాస్తే మంటలు తగ్గిపోతాయి. ఈ ఆకును సెగ గడ్డలకు రాస్తే పగిలిపోయి చీము బయటికి వచ్చి నొప్పి తగ్గుతుంది. కాళ్లు, చేతులు మంట‌లు పుడుతున్నప్పుడు గోరింటాకు ర‌సంలో బియ్యం కడిగిన నీటిని పోసి మంట ఉన్న దగ్గర రాస్తే తగ్గిపోతాయి. కీళ్ల నొప్పుల‌ ఉంటే గోరింటాకును నూరి నొప్పుల‌పై ప‌ట్టులా వేస్తే నొప్పులు ఉండవు. అంతేకాకుండా మహిళల్లో వ‌చ్చే తెల్ల కుసుమ వ్యాధిని కూడా త‌గ్గించ‌వ‌చ్చు. దీనిని మెత్తగా నూరి రెండు పూట‌లా రాస్తూ ఉంటే రెండు రోజులలోనే తెల్ల కుసుమ వ్యాధి నయం అవుతుంది. గోరింటాకు ర‌సాన్ని తాగితే పురుషులలో మూత్రం ద్వారా వీర్యం ప‌డిపోకుండా ఉంటుంది.


Related News

Non-vegetarian food: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా ? అయితే జాగ్రత్త !

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Big Stories

×