BigTV English

Courses in Artificial Intelligence : ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌‌పై కోర్సులు.. యూనివర్సిటీల నిర్ణయం..

Courses in Artificial Intelligence : ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌‌పై కోర్సులు.. యూనివర్సిటీల నిర్ణయం..


Courses in Artificial Intelligence : ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ఏఐ లేకపోతే భవిష్యత్తే లేదు అనే విధంగా టెక్ కంపెనీలు అన్నీ దానికి ముఖ్య పాత్రను అందిస్తున్నాయి. ఏఐ సామర్థ్యంతో పలు ఇంటర్నెట్ సర్వీసులను, యాప్స్‌ను తయారు చేసి కస్టమర్లను ఆకర్షించాలని సంస్థలు టార్గెట్‌గా పెట్టుకున్నాయి. మరి టెక్ రంగంలోనే ఇంత సంచలనం సృష్టించిన ఈ ఏఐ గురించి ఇంకా కొంతమందికి తెలియదు. ముఖ్యంగా దీని గురించి యూత్‌కు తెలియజేయడం కోసమే ఫ్లోరిడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది.

ఏఐ గురించి విద్యార్థులకు తెలియడం వారి భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుందని టెక్ నిపుణులు అనుకుంటున్నారు. అదే విధంగా పలువురు విద్యార్థులు కూడా స్వచ్ఛందంగా ఏఐ గురించి తెలుసుకోవడానికి ముందుకొస్తున్నారు. దీని గురించి తెలుసుకోవడం కోసం చాలా సమాచారం అనేది గూగుల్, యూట్యూబ్ లాంటి వాటిలో దొరుకుతోంది. అయినా కూడా తరగతి గదిలో వీటి గురించి పాఠాలు ఉండడం అనేది వారికి మంచి చేస్తుందని భావించిన ఫ్లోరిడా ప్రభుత్వం.. ఆ విధంగా అడుగులు వేస్తోంది.


ఫ్లోరిడా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో యూనివర్సిటీలే కొత్త కొత్త ప్రయోగాలను చేస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఉంటాయి. అదే విధంగా అక్కడ యూనివర్సిటీలలో ఏఐ గురించి, జెనరేటివ్ ఏఐ గురించి పాఠాలు ఉండడం మంచిదని యాజమాన్యాలు భావిస్తున్నాయి. కొన్ని దేశాల్లో ఏఐ అనేది విద్యార్థుల చదువుకు ఆటంకం కలిగిస్తుందని కొందరు నిపుణులు వాదిస్తున్నారు. అంతే కాకుండా యూనివర్సిటీలలో ఏఐ, చాట్‌జీపీటీ లాంటివి నిషేధించి, అవి ఉపయోగించే విద్యార్థులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని కూడా ఆదేశించారు.

చాట్‌జీపీటీ అనేది తప్పులు చేస్తుంది. ఒక్కొక్కసారి తప్పు సమాధానాలతో విద్యార్థులను అయోమయంలో పడేస్తుంది. అయినా కూడా దాని గురించి తెలుసుకోవడం ముఖ్యమని ఫ్లోరిడా యూనివర్సిటీలు అంటున్నాయి. త్వరలోనే ఇంటర్నెట్ ప్రపంచంలో జెనరేటివ్ ఏఐ అనేది ఊహించని సంచలనాలను సృష్టిస్తుంది. కాబట్టి దీని గురించి విద్యార్థులకు అవగాహన ఉండడం మంచిదని టీచర్లు సైతం భావిస్తున్నారు. ఒకవేళ దీనిపై సరిపడా అవగాహన లేకపోతే.. దీని వల్ల కలిగే నష్టాలకు కూడా వారు బాధ్యులు అవుతారని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×