Big Stories

Credit Card Upgrade :క్రెడిట్‌ కార్డును అప్‌గ్రేడ్‌ చేసుకుంటే మంచిదేనా? ఎలాంటి ఫీజులు కట్టాల్సి ఉంటుంది?

Credit Card Upgrade

Credit Card Upgrade : నిరభ్యంతరంగా క్రెడిట్ కార్డ్ అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.. మీకు గనక అవసరాలు ఉంటే. లేదు.. ఇప్పుడున్న లిమిట్, బెనిఫిట్స్ చాలు అనుకుంటే మాత్ర అక్కర్లేదు.

- Advertisement -

క్రెడిట్‌ కార్డు అప్‌గ్రేడ్‌ చేసుకోవడం అంటే.. క్రెడిట్‌ లిమిట్‌ పెంచుకోవడమే. ఇప్పటి వరకు లక్ష రూపాయల వరకు లిమిట్ ఇస్తే.. అప్‌గ్రడేషన్ తరువాత లక్షన్నరకు పెంచొచ్చు. దాన్నిబట్టి అంతే మొత్తంలో రివార్డ్ పాయింట్స్ పెరగొచ్చు, లేదా తగ్గొచ్చు. ఈ విషయంలో బ్యాంకుల నుంచి క్లారిటీ తీసుకోవడం బెటర్. లేదూ.. క్రెడిట్ లిమిట్ పెంచడమే ముఖ్యం అనుకుంటే.. రివార్డ్ పాయింట్స్ గురించి పట్టించుకోనక్కర్లేదు. క్రెడిట్ లిమిట్ పెంచుకోవడం వల్ల క్రెడిట్ స్కోర్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. సో, ఒకరకంగా అప్ గ్రేడ్ అవడం బెటరే.

- Advertisement -

ముఖ్యంగా ఆదాయం పెరుగుతుంటేనే అప్ గ్రేడ్‌కు వెళ్లాలి. మీ ఇన్‌కమ్ పెరుగుతుంటే.. ఆ విషయం బ్యాంకులకు తెలిసిపోతుంది. లేదంటే క్రెడిట్ కార్డ్ యూసేజ్ ద్వారా కూడా వాళ్లకు విషయం అర్ధమవుతుంది. కొన్ని సందర్భాల్లో బిజినెస్ పెంచుకోడానికి కూడా ఇలాంటి ఆఫర్స్ ఇస్తారు. సో, రివార్డ్ పాయింట్స్, క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్స్, ట్రావెలింగ్‌ కన్సెషన్‌లు, ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ బెనిఫిట్స్ ఎక్కువగా వాడుకునే వారికి క్రెడిట్ కార్డ్ అప్‌గ్రడేషన్ బెస్ట్ ఛాయిస్.

క్రెడిట్‌ కార్డుపై వచ్చే బెనిఫిట్ల కంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటేనే క్రెడిట్ కార్డును అప్‌గ్రేడ్‌ చేసుకోవాలి. అంతేకాదు.. ఇప్పుడున్న రివార్డ్ పాయింట్స్.. కొత్త క్రెడిట్‌ కార్డుకు ట్రాన్స్‌ఫర్‌ అవుతాయో లేదో కనుక్కోవాల్సి ఉంటుంది. సాధారణంగా రివార్డ్ పాయింట్లు ట్రాన్స్ ఫర్ అవుతుంటాయి. అలా కాని పక్షంలో అడిగి కన్ఫామ్ చేసుకోవడం బెటర్. రివార్డ్ పాయింట్స్ షేర్ అవ్వవు అనుకున్నప్పుడు వాటిని రిడీమ్ చేసుకోవడం ఉత్తమం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News