Big Stories

Delhi Liquor Scam: సీఎం కేజ్రీవాల్‌కు సీబీఐ నోటీసులు.. కవితకూ తప్పవా చిక్కులు?

cm arvind kejriwal CBI

Delhi Liquor Scam Updates: ఆయన ఓ రాష్ట్రానికి సీఎం. అయితేనేం.. తప్పు చేశారనే అనుమానంతో నోటీసులు జారీ చేసింది సీబీఐ. తమకు సీఎం అయినా, ఎవరైనా ఒక్కటేనని.. తమ పని తాము చేసుకుపోతామన్నట్టుగా దూకుడు పెంచింది.

- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేసి లోపలేసింది ఈడీ. ఈసారి నేరుగా ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌నే టార్గెట్ చేసింది సీబీఐ. ఈ నెల 16న విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. కొత్త మద్యం పాలసీ తయారీపై వివరణ ఇవ్వాలని నోటీసులో తెలిపింది.

- Advertisement -

ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసింది ఈడీ. వారి రిమాండ్ రిపోర్టుల్లో సీఎం కేజ్రీవాల్ పేరును కూడా చేర్చింది. ఈడీతో పోలిస్తే సీబీఐ దూకుడు తక్కువే. తాజాగా, ముఖ్యమంత్రినే విచారణకు పిలిచి రేసులోకి వచ్చింది సీబీఐ.

డిప్యూటీ సీఎంను, ఓ మంత్రిని అరెస్ట్ చేయడం.. సీఎంకు నోటీసులు ఇవ్వడం.. ఇవేవీ మామూలు విషయాలు కావు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎంతటి వారినైనా వదిలేది లేదనే మెసేజ్‌ను బలంగా ఇస్తున్నాయి జాతీయ దర్యాప్తు సంస్థలు. ఇదే కేసులో ఎమ్మెల్సీ కవితను సైతం సుదీర్ఘంగా విచారించింది ఈడీ. అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరిగినా.. ఎందుకోగానీ ఆఖరి నిమిషంలో వెనక్కి తగ్గిందని అంటున్నారు. సౌత్ గ్రూపులో కవితనే కింగ్ పిన్ అని అంటుండటం.. 100 కోట్ల మనీ లాండరింగ్ ఆమె ద్వారానే జరిగిందని చెబుతుండటం.. లేటెస్ట్‌గా జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ సైతం కవితక్కతో చేసిన వాట్సాప్ చాటింగ్‌ను రిలీజ్ చేయడం.. ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులోనైనా కవిత అరెస్ట్ తప్పదని అంటున్నారు.

సీఎంకే నోటీసులు ఇచ్చిన వారు.. ఎమ్మెల్సీని వదిలేస్తారా? లేదంటే, ఆప్ మెయిన్ టార్గెట్ కాబట్టి ఫుల్‌గా కార్నర్ చేస్తున్నారా? బీఆర్ఎస్ విషయంలో కాస్త వేచిచూసే స్ట్రాటజీ అమలు చేస్తున్నారా? సరైన సమయంలో సరైన నిర్ణయం ఉంటుందా? చట్టం తనపని తాను చేసుకుపోతుందా? ఇలా ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత చుట్టూ అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News