BigTV English

Tesla Cyber Truck : విడుదలకు ముందే టెస్లా సైబర్ ట్రక్‌పై విమర్శలు..

Tesla Cyber Truck : విడుదలకు ముందే టెస్లా సైబర్ ట్రక్‌పై విమర్శలు..
Tesla Cyber Truck


Tesla Cyber Truck : టెస్లా అనేది ఆటోమొబైల్ రంగంలోనే ఫుల్ క్రేజ్ ఉన్న సంస్థ. ఈరోజుల్లో ప్రతీ ఆటోమొబైల్ కంపెనీ ట్రెండ్‌కు తగినట్టుగా, కస్టమర్ల టేస్ట్‌కు తగినట్టుగా మారుతూ వస్తున్నాయి. అందుకే టెస్లా.. తనకు పోటీగా కంపెనీలు మారుతున్నాయనే భావనతో మరింత అడ్వాన్స్ టెక్నాలజీతో వాహనాలను తయారు చేయడం మొదలుపెట్టింది. త్వరలోనే సైబర్ ట్రక్కులను కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతోంది టెస్లా.

టెస్లా ఫ్యాన్స్ అందరూ ఈ సైబర్ ట్రక్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. నిపుణులు మాత్రం అప్పుడే వీటిపై చర్చలు మొదలుపెట్టేశారు. 2019లో ఈ సైబర్ ట్రక్ లాంచ్ గురించి అనౌన్స్‌మెంట్ జరిగింది. 2021లోనే ఇది లాంచ్ అవుతుందని ప్రకటించినా.. ఇప్పటికీ దీని జాడ లేదు. కానీ అప్పటినుండి ఇప్పటివరకు సైబర్ ట్రక్కుల కోసం దాదాపు 1.5 మిలియన్ ప్రీ ఆర్డర్లను అందుకుంది టెస్లా. ఇక సైబర్ ట్రక్ తయారీ ఫైనల్ స్టేజ్‌కు చేరుకుందని, త్వరలోనే లాంచ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి.


సైబర్ ట్రక్ వల్ల ఎక్కువగా ఎదురుచూసేలా చేయడం వల్ల ప్రీ ఆర్డర్ చేసినవారిలో కూడా ఆసక్తి పోతుందని నిపుణులు భావిస్తున్నారు. కానీ ఒక్క ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ మాత్రం టెస్లా అనేది ఆటోమొబైల్ రూపురేఖలను మార్చేస్తుందని నమ్ముతోంది. ప్రస్తుతం టెస్లాలో మోడల్ వైకు విపరీతమైన పాపులారిటీ ఉంది. సైబర్ ట్రక్ అనేది అంతకు మించి పాపులారిటీని అందుకుంటుందని ఏఆర్కే ఇన్వెస్ట్ అనే సంస్థ చెప్తుంది.

సైబర్ ట్రక్ అనేది మార్కెట్లో లాంచ్ అయ్యి క్లిక్ అయితే మాత్రం ఎన్నో ట్రేడీషనల్ ట్రక్కులు కచ్చితంగా మార్కెట్లో ఇబ్బంది పడాల్సిందే అని ఏఆర్కే ఇన్వెస్ట్ సంస్థ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ టెస్లా సైబర్ ట్రక్ గురించి గూగుల్‌లో తెగ సెర్చ్ చేసేస్తున్నారు నెటిజన్లు. ఇప్పటికే సైబర్ ట్రక్ అనేది ఎంతో వెబ్ ఇంట్రెస్ట్‌ను తీసుకువచ్చిందని తెలుస్తోంది. ఏ కమర్షియల్ వెహికిల్ అయినా లాంచ్ విషయంలో ఇంత ఆలస్యం అయితే.. కస్టమర్లు నిరాశ చెందుతారని, కానీ టెస్లా సైబర్ ట్రక్ విషయంలో అలా జరగడం లేదని తెలుస్తోంది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×