Dark Web: చాట్‌జీపీటీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అనేవి వచ్చిన తర్వాత డార్క్ వెబ్‌ను యాక్సెస్ చేయడం, హ్యాకింగ్ లాంటివి సైబర్ క్రిమినల్స్‌కు మరింత సులువుగా అయ్యాయని కొందరి వాదన. కానీ చాట్‌జీపీటీ లాంటి టెక్నాలజీ అనేది అంత సులువుగా హ్యాక్ అవ్వదని మరికొందరు టెక్ నిపుణులు వాదన. తాజాగా ఈ పరిశోధనల్లో భాగంగానే కొరియన్ శాస్త్రవేత్తలు కేవలం డార్క్ వెబ్‌ను మాత్రమే ఉపయోగించే ఒక కొత్త రకమైన ఏఐ లాంగ్వేజ్ మోడల్‌ను సిద్ధం చేశారు. అదే డార్క్‌బెర్ట్.
డార్క్‌బెట్ అనేది కేవలం డార్క్ వెబ్‌లోని డేటా సెట్స్‌తో మాత్రమే ట్రెయిన్ చేయబడింది. చాట్‌జీపీటీ, బ్రాడ్ లాగానే ఇది కూడా ఒక ప్రత్యేకమైన ఏఐ లాంగ్వేజ్ మోడల్. డార్క్ వెబ్‌లో పలు డేటా సెట్స్ అనేవి ఎలా ఉపయోగపడతాయి అనే విషయంపై డార్క్‌బెర్ట్ సడీ చేస్తుంది. ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ ఉద్యోగులకు సాయంగా ఉండడం కోసమే ఈ డార్క్‌బెర్ట్‌రు తయారు చేశామని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. డార్క్‌బెర్ట్‌ను ట్రెయిన్ చేయడం కోసం శాస్త్రవేత్తలు ఎన్నో ప్రత్యేకమైన టూల్స్‌ను ఉపయోగించినట్టు తెలుస్తోంది.
16 రోజుల పాటు రెండు వేర్వేరు డేటా సెట్స్‌తో డార్క్‌బెర్ట్ ట్రైనింగ్ జరిగింది. డార్క్ వెబ్‌లో ఎలాంటి డేటా ఉంటుందో.. అదంతా డార్క్‌బెర్ట్‌లో పొందుపరచబడింది. ఈ డార్క్‌బెర్ట్ అనేది ఇప్పట్లో ప్రజలకు అందుబాటులోకి రావడం అసాధ్యం అని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ప్రస్తుతం ఇది ఏఐ గురించి స్టడీ చేసే సంస్థల్లో మాత్రమే అందుబాటులో ఉంటుందని, దీని ద్వారా డార్క్ వెబ్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందని వారు చెప్తున్నారు.
డార్క్‌బెర్ట్ లాంటి ఒక ఏఐ మోడల్ ఐడియా అనేది ఇప్పటివరకు శాస్త్రవేత్తలకు రాలేదని, ప్రపంచ దేశాల్లో ఉన్న ఇతర శాస్త్రవేత్తలు ప్రశంసిస్తున్నారు. ఒకవేళ ఏఐ మోడల్ అనేది హ్యాక్ అయితే దానికి ఏం చేయాలో ప్రస్తుతం నిపుణులు ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధంగా లేరు. ఇలాంటి సమయంలోనే డార్క్‌బెర్ట్ అనేది వారికి అండగా నిలబడుతుందని అన్నారు. ఇంకా మార్కెట్లోకి వచ్చే సూచనలు లేకపోయినా.. డార్క్‌బెర్ట్ అనేది ఇప్పటికే చాలామంది శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది.