BigTV English

Dimple Hayathi : ట్రాఫిక్ డీసీపీ, హీరోయిన్ మధ్య వార్.. గొడవకు కారణమిదేనా..?

Dimple Hayathi : ట్రాఫిక్ డీసీపీ, హీరోయిన్ మధ్య వార్.. గొడవకు కారణమిదేనా..?

Dimple Hayathi : హీరోయిన్ డింపుల్‌ హయాతిపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఐపీఎస్‌ అధికారి, ట్రాఫిక్‌ డీసీపీ రాహుల్‌ హెగ్డే కారుపై దాడి చేశారని ఆయన డ్రైవర్‌ చేతన్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డింపుల్ తోపాటు డేవిడ్‌ అనే వ్యక్తిపైనా కేసు నమోదైంది.


జూబ్లీహిల్స్‌ జర్నలిస్టు కాలనీలోని హుడా ఎన్‌క్లేవ్‌పై డీసీపీ హెగ్డే , డింపుల్‌ హయాతి, డేవిడ్‌ నివాసం ఉంటున్నారు. సెల్లార్‌లో ఉన్న పార్కింగ్‌ ప్లేస్‌లో హెగ్డే అధికారిక వాహనాన్ని డింపుల్‌ హయాతి ధ్వంసం చేసిందని డీసీపీ డ్రైవర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డింపుల్, డేవిడ్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. 41 సీఆర్‌పీసీ కింద పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. ఈ విషయంపై డింపుల్‌ హయాతి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. అధికారాన్ని దుర్వినియోగం చేశారని డీసీపీని ఉద్దేశించి ట్వీట్ చేసింది.

ఈ ఘటనపై ట్రాఫిక్ డీసీపీ రాహుల్‌ హెగ్డే స్పందించారు. డింపుల్‌ హయాతి తన అధికారిక వాహనాన్ని ఢీకొట్టిందని ఆరోపించారు. తాను పార్క్‌ చేసే స్థలంలో డింపుల్‌ కారు అడ్డంగా పెడుతోందన్నారు. తన వాహనాన్ని ఢీకొట్టి కాలుతో తన్నిందని పేర్కొన్నారు. ఇలా చాలా సార్లు జరిగిందని వివరించారు. తాను వ్యక్తిగతంగా రిక్వెస్ట్‌ చేసినా ఆమె తీరు మారలేదని తెలిపారు. ఈ పరిస్థితుల్లోనే డ్రైవర్‌ చేతన్‌ జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారని డీసీపీ వివరించారు. తనకు డింపుల్‌ తో వ్యక్తిగత గొడవలేమీ లేవన్నారు. పోలీసుల విచారణలో వాస్తవాలు బయటపడతాయని రాహుల్‌ హెగ్డే అన్నారు.


డింపుల్ హయాతి తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. ఆమెకు ఖిలాడి మూవీతో మంచి పేరు తెచ్చింది. తాజాగా గోపిచంద్‌ సరసన రామబాణం మూవీలో నటించింది. ఈ సినిమా మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

×