BigTV English

Death Prediction : మీకు చావు వచ్చే ముందు ఇలా ఉంటుంది.. షాకింగ్ నిజాలు..!

Death Prediction : మీకు చావు వచ్చే ముందు ఇలా ఉంటుంది.. షాకింగ్ నిజాలు..!

Death Prediction : కళ్లు తెరిస్తే జననం, కళ్లు మూస్తే మరణం.. ఈ రెప్పపాటు కాలమే జీవితం. జనన మరణాలు మన చేతిలో ఉండవు. ముఖ్యంగా చావు గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరిని వణికించే పదం ఇది. పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. చావు నుంచి ఎవరూ బయటపడలేరు. ఈ సత్యాన్ని ఎవరూ ఖండించలేరు.


అయితే ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ కామెరాన్ షా మనిషి చనిపోవడానికి 30 సెకన్ల ముందు ఎలాంటి సంకేతాలు వస్తాయో.. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నాడు. ఇందుకు గానూ ఓ మహిళ బ్రెయిన్‌పై పరిశోధనలు చేసి కొన్ని నిజాలు పంచుకున్నారు.

మెదడుకు రక్తం శరీరంలోని కిందిభాగం నుంచి సరఫరా అవుతుంది. కానీ ఎప్పుడైతే మరణం సంభవిస్తుందో దాని కంటే కొంత సమయానికి ముందే మెదడుకు రక్త సరఫరా ఆగిపోతుందట. దీంతో మన చావు మెదడుకు ముందే తెలిసిపోతుంది.


ఇలా జరగడం వల్ల 10 నుంచి 20 సెకన్ల మధ్య తాను చనిపోతున్నాను అనే విషయం క్లియర్‌‌గా మనిషికి అర్థం అయిపోతుందట. కామెరాన్ చాలా మందిపై ప్రయోగాలు చేసి ఈ విషయాన్ని వెల్లడించాడట. మీ మెదడే మీకు చనిపోతున్నారన్న విషయం స్పష్టంగా చెబుతుందట. మరణం గురించి సైన్స్ ఇలా అంటుంటే.. పురాణాల ప్రకారం మరణానికి సంకేతాలు మరోలా ఉన్నాయి.

శివ పురాణం ప్రకారం మరణానికి ముందు సూచనలు ఇలా ఉన్నాయి..

  • మనిషి ఆరు నెలల్లో మరణిస్తాడనగా.. శరీరం లేత పసుపు లేదా కొద్దిగా ఎర్రగా మారుతుంది.
  • మనిషి ప్రతిబింబం నీరు, నూనె లేదా అద్ధంలో కనిపించకపోతే ఆ వ్యక్తి ఆరు నెలల్లో మరణిస్తాడని సూచన.
  • మనిషి చనిపోయే టైం కంటే ఒక నెల ఎక్కువ ఎవరైతే జీవిస్తారో వాళ్లు వారి సొంత నీడను కూడ చూడలేరట. ఒక వేళ చూసినట్లయితే తల లేని నీడ మాత్రమే కనపడుతుంది.
  • మనిషి నాలుక అకస్మాత్తుగా ఉబ్బినా లేదా దంతాల నుంచి చీము పడితే వారు ఆరు నెలల కంటే ఎక్కువకాలం బ్రతకరు.
  • మనిషి చేయి వారం వరకు పట్టేస్తూ ఉన్నా లేదా నరాలు బిగుసుకు పోయిన ఒక నెల కంటే ఎక్కువకాలం జీవించలేరు.
  • ఒక వ్యక్తి ప్రతిదీ నల్లగా చూడటం ప్రారంభిస్తే ఆ వ్యక్తికి చావు దగ్గరలోనే ఉందని అర్థం.
  • ఒక వ్యక్తి చంద్రుడు, సూర్యుడు లేదా అగ్ని వెలుతురు చూడలేకపోతే ఆ వ్యక్తి ఆరు నెలలు మాత్రమే సజీవంగా ఉండగలడని అర్థం.
  • ఒక వ్యక్తి ఆకాశంలో ధ్రువ నక్షత్రాన్ని చూడలేకపోతే ఆ వ్యక్తి జీవితం ఆరు నెలలు మాత్రమే ఉంటుందట.
  • ఒక వ్యక్తి సూర్యుడు, చంద్రుడు, ఆకాశాన్ని చూసిన ప్రతీసారి ఎర్రగా కనిపిస్తే అతడు కొద్ది రోజుల్లో చనిపోతాడు.
  • మన చేతిలోని జీవన రేఖ మనం ఎంతకాలం బతుకుతామో చెబుతుందట. ఎవరికైనా వారి జీవన రేఖ కట్ చేసి ఉంటే వారు తక్కువ కాలం బతుకుతారు.
  • మరణం ఒక రహస్యం లాంటిది. ధర్మ గ్రంధం ప్రకారం వ్యక్తి ఆత్మ.. ఆ మనిషి బతికి ఉండగా చేసిన కర్మలను బట్టి స్వర్గానికో నరకానికో వెళుతుంది.

పురాణాలలో అమృతుడనే కవికి.. యమధర్మరాజు ప్రత్యక్షమై మరణం గురించి ఇలా చెప్పాడు..

  • మనిషికి మరణం సంభవించే ముందు.. చర్మం ముడతలుబడిపోతుంది. వెంట్రుకలు తెల్లబడిపోతాయి.
  • కళ్లు కనిపించకుండా పోతాయి. అలానే పక్షపాతం వచ్చి మంచాన పడతాడు.
  • ఒక రోజు యముడు వచ్చి నీ ఆయువు తీరింది అని అందుకే నీ ప్రాణాలను తీసుకువెళ్ళడానికి వచ్చానని చెబుతాడట.

దీనిని బట్టి మనకు తెలిసిన విషయం.. మన ఆరోగ్యమే మనకు రక్ష. ఆరోగ్యం చెడిపోయిందో ఇక మనకు చావే గతి అని తెలుసుకోవాలి. మరొక విషయం ఏమిటంటే ఎంత ధనవంతుడైన, ఎంత పేదవాడు అయినా పుట్టుక, చావులను ఎవరూ ఆపలేరని తెలుసుకోవాలి.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×