E-Paper
Advertisement

Sankranti Celebrations : సంక్రాంతి వచ్చిందే తుమ్మెద.. పందేలు తెచ్చిందే తుమ్మెద

Sankranti Celebrations : సంక్రాంతి వచ్చిందే తుమ్మెద.. పందేలు తెచ్చిందే తుమ్మెద
Advertisement

Sankranti Celebrations : సంకాంత్రి అంటే.. గోదావరి జిల్లాలు. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి అంటే మొదట గుర్తొచ్చేది కోడి పందేలు. అందుకే.. కత్తులు దూసేందుకు కోళ్లు సిద్దంగా ఉన్నాయి. యుద్ద క్షేత్రాలుగా పందేల బరులు రెడీ అవుతున్నాయి. అసలుసిసలైన సంక్రాంతతి రణరంగం మొదలైంది. మూడు రోజులు పాటు జరగబోయే ఈ పందేలపై పెద్ద ఎత్తున బెట్టింగులు జరుగుతాయి. దీని కోసం పందెం రాయుళ్లు సర్వం సిద్ధం చేశారు.

డే అండ్ నైట్ పందేలు జరిగే విధంగా ప్రత్యేక ఫ్లడ్ లైట్లు కూడా సిద్ధం చేశారు. ఈ మూడు రోజుల పాటు.. రేయింబవళ్లు.. 24 గంటలు నిర్విరామంగా పందేలు జరుగుతాయి. పిల్లలు, పెద్దోళ్లు అనే తేడా లేకుండా అందరూ బరుల చుట్టూ చేరుతారు. పోలీసులు హెచ్చరికలు జారీ చేసినా.. పందెంరాయుళ్లు మాత్రం తగ్గేదేలే అంటున్నారు. అనాదిగా వస్తున్న సాంప్రదాయాన్ని ఎలా వదులుకుంటామని చెబుతున్నారు.

Advertisement

ఇక.. సంక్రాంతి సంబరాలకు పట్టణాల వాసులంతా పల్లెలకు చేరడంతో.. పండుగ శోభ అంతా పల్లెల్లోనే కనిపిస్తోంది. ఉదయాన్నే పల్లెలు మేల్కొన్నాయి. సూరీడు రాకముందే.. వేసిన భోగిమంటలతో వెలుగొచ్చింది. డూడూ బసవన్నలు, హరిదాసులు, రంగురంగుల ముగ్గులు.. వాటి మధ్యలో గొబ్బిళ్లతో పల్లెలు కళకళలాడుతున్నాయి.

.

Advertisement

.

Related News

బొత్సకు దెబ్బ మీద దెబ్బ.. బెల్లానకు విజయనగరం జిల్లా బాధ్యతలు, వైసీపీ హైకమాండ్ కీలక నిర్ణయం

ఆటోను ఢీ కొట్టిన లారీ.. స్పాట్ లో ముగ్గురు మృతి, విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చవితి ముసురు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి..

జనసేన కొత్త వ్యూహం.. గ్రామీణ ప్రాంతాల్లో జెండా పాతేందుకు పక్కా ప్లాన్!

హారన్ కొట్టాడని బస్సెక్కి డ్రైవర్‌ను బాదేశాడు.. పెనుమాకలో బైకర్ దౌర్జన్యం!

అమరావతి రియల్టర్లకు గుడ్ న్యూస్.. భవన అనుమతులపై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు!

మరోసారి కంటతడి పెట్టిన బొత్స.. ఓదార్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు!

వైసీపీకి బిగ్ షాక్.. చిన్న శ్రీను రాజీనామా వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా?

Big Stories

Advertisement
×