E-Paper
Advertisement

Dell To Layoff:ఉద్యోగుల గుం’డెల్’ గుభేల్..

Dell To Layoff:ఉద్యోగుల గుం’డెల్’ గుభేల్..
Advertisement

Dell To Layoff:ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల్ని తీసేస్తున్న కంపెనీల జాబితాలోకి డెల్ కూడా వచ్చి చేరింది. ఒకేసారి 6,650 మందిని తొలగించబోతున్నట్లు ప్రకటించింది… డెల్. కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో ఐదు శాతం మందిని ఇంటికి సాగనంపబోతున్నట్లు ప్రకటించింది.

కరోనా సమయంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులంతా ఇళ్లకే పరిమితమై పని చేయాల్సి వచ్చింది. ఇక స్కూళ్లకు వెళ్లని విద్యార్థులు ఇంట్లోనే ఆన్‌లైన్‌ పాఠాలు వినాల్సి వచ్చింది. దాంతో పర్సనల్‌ కంప్యూటర్లకు… ముఖ్యంగా ల్యాప్ ట్యాప్ లకు డిమాండ్ భారీగా పెరిగింది. దాంతో కంప్యూటర్ తయారీ కంపెనీలు ఉత్పత్తి పెంచడం కోసం ఉద్యోగులను కూడా ఎక్కువగానే నియమించుకున్నాయి. క్రమంగా కరోనా పరిస్థితులు అదుపులోకి రావడం, అంతా మళ్లీ సాధారణంగా మారిపోవడంతో… పర్సనల్ కంప్యూటర్లకు గిరాకీ భారీగా తగ్గింది. దాంతో… అన్ని టెక్‌ కంపెనీల మాదిరే పీసీ తయారీ కంపెనీలు కూడా ఖర్చులు తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా డెల్‌ టెక్నాలజీస్‌ 6,650 మంది ఉద్యోగులను తీసేసేందుకు సిద్ధమైంది. ఆర్థిక అనిశ్చితుల కారణంగానే సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవాల్సి వచ్చిందని… డెల్ ‘కో-చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌’ జెఫ్‌ క్లార్క్‌ చెప్పారు.

Advertisement

గత డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో… పర్సనల్ కంప్యూటర్ల అమ్మకాలు దారుణంగా పడిపోయాయని… ప్రముఖ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ఐడీసీ తెలిపింది. డెల్‌ కంపెనీ అమ్మకాలు ఏడాది మొత్తమ్మీద 37 శాతం పడిపోయినట్లు వెల్లడించింది. డెల్ ఆదాయంలో 55 శాతం పర్సనల్ కంప్యూటర్ల నుంచే వస్తుంది. ఇప్పుడు వాటికి డిమాండ్ తగ్గిపోవడంతో… ఆదాయం కూడా పడిపోయింది. దాంతో… ఆలస్యంగానైనా మేల్కొన్న డెల్‌… ఉద్యోగుల్నీ తీసేయబోతున్నట్లు ప్రకటించింది. డెల్ కంటే ముందు చాలా పీసీ తయారీ కంపెనీలు ఉద్యోగుల్ని తగ్గించుకున్నాయి. గత నవంబరులో హెచ్‌పీ 6,000 మందిని తొలగించగా… సిస్కో సిస్టమ్స్‌ 4,000 మందిని ఇంటికి సాగనంపింది.

For More Live Updates Follow Us :-

Advertisement

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×