BigTV English

MLA CASE: ఫాంహౌస్ కేసులో ఉత్కంఠ కంటిన్యూ.. సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించిన డివిజన్ బెంచ్

MLA CASE: ఫాంహౌస్ కేసులో ఉత్కంఠ కంటిన్యూ.. సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించిన డివిజన్ బెంచ్
hc

MLA CASE: ఒక కేసు, వరుస ట్విస్టులు, ఎన్నో అనుమానాలు… రంగంలోకి సుప్రీం కోర్టు సీనియర్ లాయర్లు.. వాద ప్రతివాదాలు.. సిట్ ఏర్పాటు.. నిందితులతో టచ్ లో ఉన్నారంటూ ఇంకొందరికి నోటీసులు… ఇలా ఫాంహౌజ్ ఎమ్మెల్యేల ట్రాప్ కేసులో ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. గతేడాది అక్టోబర్ 26న మొయినాబాద్ ఏరియాలోని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌజ్ లో ఎమ్మెల్యేల కొనుగోలు కోసం డీల్ జరుగుతోందని ప్రచారం అవడం, వెంటనే సైబరాబాద్ సీపీ రంగంలోకి దిగడం, స్పాట్ కు వెళ్లడం, అప్పడంతా ఓ రేంజ్ లో హడావుడి నడిచింది. సీన్ కట్ చేస్తే ఆ ఇష్యూ కాస్తా ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారింది.


అసలు ఎమ్మెల్యేలను కొనేందుకు ఎవరెవరు ప్రయత్నించారన్న కోణంలో విచారణకు రాష్ట్ర సర్కార్ దూకుడుగా వ్యవహారం నడిపింది. సిట్ ఏర్పాటు చేసింది. నిందితులను విచారించారు. నిందితులతో టచ్ లో ఉన్నారంటూ బీఎల్ సంతోష్, జగ్గుస్వామి, తుషార్, శ్రీనివాస్ కు నోటీసులు ఇచ్చారు. బీఎల్ సంతోష్ విచారణకు హాజరు అవకుండా కోర్టులో స్టే తెచ్చుకున్నారు. ప్రస్తుతం కేసు రకరకాల మలుపులు తిరిగి సీబీఐ చేతిల్లోకి వెళ్లేందుకు రెడీగా ఉంది. సిట్ ఏర్పాటుతో ఈ ఇష్యూలో ఎవరెవరు ఉన్నారు.. ఏం జరిగింది.. ఏం జరుగుతోందన్నది తేల్చాలనుకున్నారు. అయితే తమ పార్టీ బద్నాం అవుతోందని చెప్పి బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి హైకోర్టులో కేసు వేశారు. ఈ ఇష్యూను సీబీఐకి అప్పగిస్తే అసలు విషయాలు బయటికొస్తాయన్న దాకా విషయం వెళ్లింది.

హైకోర్టు సింగిల్ బెంచ్.. కేసును సీబీఐకి అప్పగించాలని గతంలో తీర్పు ఇచ్చింది. ఈ ఇష్యూపై వాదనలు జరిగే సమయంలో పిటిషనర్ల తరపున సుప్రీం కోర్టు సీనియర్ లాయర్లు రంగంలోకి దిగారు. సీబీఐకి అప్పగించాలని, అప్పగించవద్దని వాడి వేడి వాదనలు జరిగాయి. అయితే చివరకు హైకోర్టు సింగిల్ బెంచ్… ఎమ్మెల్యేల కేసును సీబీఐకి అప్పగించాలని తీర్పు ఇచ్చింది. దీనిపై ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రాష్ట్ర సర్కార్ హైకోర్టు డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేశాయి. అప్పుడు కూడా మరోసారి హైకోర్టులో పెద్ద ఎత్తున వాదోపవాదాలు నడిచాయి. వాదనలు విన్న సీజే బెంచ్ తీర్పు రిజర్వ్ లో పెట్టి లేటెస్ట్ గా నిర్ణయాన్ని వెలువరించింది. సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును తప్పుబట్టలేమని, అందులో జోక్యం చేసుకోబోమని ధర్మాసనం క్లారిటీ ఇచ్చింది. అయితే ఇదే ఇష్యూపై రాష్ట్ర సర్కార్ సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. అందుకు తీర్పును 15 రోజుల పాటు అమలు చేయకుండా చూడాలని హైకోర్టును ఏజీ కోరారు. అయితే దీనికి ధర్మాసనం నిరాకరించింది. అంటే వెంటనే సీబీఐ చేతుల్లోకి దర్యాప్తు వివరాలు, ఆధారాలు ఇవ్వాల్సి ఉంటుంది.


నిజానికి ఫాంహౌజ్ కేసు సీబీఐకి బదిలీ అవడాన్ని రాష్ట్ర సర్కార్ అస్సలు ఇష్టపడడం లేదు. జీర్ణించుకోలేకపోతోంది. తమ పరిధిలోనే విచారణ జరిపించాలనుకుంది. ఏదో అనుకుంటే ఇంకేదో అయిందన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి మారిందని పొలిటికల్ ఎనలిస్టులు అంటున్నారు. నిజానికి రాష్ట్ర సర్కార్ తరపున వాదనలు వినిపించిన సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ దుష్యంత్ దవే సీబీఐతో పారదర్శకంగా విచారణ జరగదని, కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో ఉంటుందన్నారు. అయితే హైకోర్టు మాత్రం సీబీఐకి అప్పగించాలన్న వాదనవైపే మొగ్గు చూపింది. సుప్రీంకు వెళ్లే వరకు కూడా స్టే కూడా ఇచ్చేది లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి వివరాలు ఇవ్వాలని గతంలో సింగిల్ బెంచ్ జడ్జి తీర్పు ఇవ్వగానే సీఎస్ కు సీబీఐ అధికారులు లేఖ రాశారు. ఇప్పుడు డివిజన్ బెంచ్ తీర్పుతో దూకుడు పెంచడం ఖాయమంటున్నారు.

ఫాంహౌజ్ కేసు కాస్తా ఫైనల్ గా సీబీఐ, ఈడీ దగ్గరికి వెళ్తున్నాయి. నిందితుడు నందు వ్యాపారాలపై ఇటీవలే ఈడీ ఫోకస్ పెట్టింది. ఎవరెవరితో బిజినెస్ డీల్స్ ఉన్నాయన్న కోణంలో ఆరా తీశారు. అటు ఫాంహౌజ్ లో వంద కోట్లు దొరికాయన్న వాదనను అప్పట్లో వినిపించారు. కానీ స్పాట్ లో డబ్బు దొరకకపోవడం మరో ట్విస్ట్ గా మారింది. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు సీబీఐ దర్యాప్తుతో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనన్న ఉత్కంఠ అయితే కొనసాగుతుంది.

Tags

Related News

OTT Movie : భార్య ఉండగానే మరో అమ్మాయితో… భర్త పై పగతో రగిలిపోయే అమ్మాయిలు… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

Bigg Boss Telugu 9: దివ్య వైల్డ్ ఎంట్రీ.. వచ్చిరాగానే లవ్ బర్ట్స్ బండారం బట్టబయలు.. రీతూ పరువు మొత్తం పాయే!

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Big Stories

×