BigTV English
Advertisement

Demolish Bridges : బ్రిడ్జిలను కూల్చడానికి కొత్త టెక్నాలజీ..

Demolish Bridges : బ్రిడ్జిలను కూల్చడానికి కొత్త టెక్నాలజీ..

ఒకప్పుడు సరైన మౌలిక సదుపాయాలు లేకపోయినా.. అడ్వాన్స్ టెక్నాలజీ లేకపోయినా.. కట్టడాలు అనేవి చాలా బలంగా ఉండేవి. అప్పటి కట్టడాలతో పోలిస్తే.. ఇప్పటి కట్టడాలు అంత ధృడంగా ఉండడం లేదని తెలిసిన విషయమే. టెక్నాలజీ పెరిగిన తర్వాత కట్టడాల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో.. కూల్చివేతల విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు భావించారు. అందుకే వారు ఓ నిర్ణయానికి వచ్చారు.


టెక్నాలజీతో పాటు ఈరోజుల్లో క్రియేటివిటీ కూడా పెరిగిపోతోంది. అంచనాలకు మించిన ఐడియాలకు టెక్నాలజీ తోడుగా నిలబడుతోంది. తాజాగా డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ యాక్సిలరేటర్ (డాసా) ఒక కొత్త బ్రిడ్జ్ టు ఫాల్ అనే ఓ కొత్త ఇన్నోవేషన్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. అప్పట్లో బ్రిటిష్ ఆర్మీ కట్టిన బ్రిడ్జిలు చాలా ధృడంగా ఉండేవి. అందుకే వాటిని కూల్చివేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే వీటిని కూల్చివేయడానికి కొత్త ఐడియాలు కనిపెట్టడానికి బ్రిడ్జ్ టు ఫాల్ తోడ్పడుతుంది.

మామూలుగా ఒక బ్రిటిష్ ఆర్మీ బ్రిడ్జ్ కూల్చివేయాలంటే మిలిటరీ వారు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. దీని వల్ల అప్పుడప్పుడు వారికి ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. అందుకే ఆ ప్రమాదాలను తగ్గించి బ్రిడ్జిలకు కూల్చివేసే ప్రక్రియను సులువు చేయాలని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. అంతే కాకుండా వాటిని కూల్చివేయడానికి పట్టే సమయాన్ని కూడా తగ్గించాలని వారు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే ఈ విభాగంలో పూర్తిస్థాయి పరిశోధనలు చేసి.. ప్లాన్‌ను అమలు చేయనున్నట్టు తెలుస్తోంది.


ఒకప్పుడు బ్రిడ్జిలు ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్లడానికి మాత్రమే కాకుండా ఎన్నో అత్యవసరమైన వస్తువులను ఒక ఊరి నుండి మరో ఊరికి తరలించడానికి కూడా ఉపయోగపడేవి. అంతే కాకుండా డిఫెన్స్ విషయంలో కూడా బ్రిడ్జిలు ఎంతో ముఖ్య పాత్రను పోషించాయి. బ్రిడ్జిలను కట్టడం ఎంత కష్టమో కూల్చివేయడం కూడా అంతే కష్టం అంటున్నారు శాస్త్రవేత్తలు. ముందుగా బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిగా స్టడీ చేస్తేనే ఇది సాధ్యమని వారు తెలిపారు.

బ్రిడ్జ్ టు ఫాల్ ప్రాజెక్ట్ ప్రతీ ఒక్కరి దగ్గర నుండి బ్రిడ్జిల కూల్చివేతల విషయంలో సలహాలు తీసుకోనుంది. కూల్చివేయడానికి సమయాన్ని, దాని వల్ల మనుషులకు జరిగే ప్రమాదాలను తగ్గించే విధంగా ప్లాన్ చేయనుంది. కాకపోతే ఈ క్రమంలో ఎదురయ్యే ఛాలెంజ్‌లపై కూడా ఈ ప్రాజెక్ట్ పూర్తి ఫోకస్ పెట్టనుంది. ముందుగా బ్రిడ్జి ఎంత ధృడంగా ఉంది, బ్రిడ్జిలను పేల్చడానికి ప్రయత్నిస్తే దాని వల్ల జరిగే నష్టాలు ఏంటి, మానవ సాయం లేకుండా బ్రిడ్జిలను కూల్చివేయగలమా.. ఇలాంటి విషయాల గురించి క్షుణ్ణంగా స్టడీ చేయనున్నారు.

Tags

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×