BigTV English

Depression : డిప్రెషన్‌ను గుర్తించే క‌త్రిమ మేధస్సు..

Depression : డిప్రెషన్‌ను గుర్తించే క‌త్రిమ మేధస్సు..
Depression

Depression : ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) అనేది కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీకి మాత్రమే కాదు.. వైద్య రంగానికి కూడా ఉపయోగపడేలా డిజైన్ చేయబడుతోంది. ఇప్పుడు మొదటి స్టేజ్‌లో ఉన్న కృత్రిమ మేధస్సు తయారీ వెంటనే వైద్య రంగానికి ఉపయోగపడకపోయినా.. త్వరలోనే ఇందులో అలాంటి ఫీచర్లు ఏర్పాటు చేస్తామని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తాజాగా అందులో మొదటి అడుగు కూడా వేశారు.


డిప్రెషన్ అనేది ఈమధ్య చాలామందిలో ముఖ్యంగా యువతీయువకుల్లో కామన్‌గా కనిపిస్తున్న సమస్య. దీనిని ముందుగానే కనుక్కోవడానికి ఎలాంటి ప్రత్యేక పరిజ్ఞానం లేకపోవడంతో.. ఆత్మహత్యల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. అయితే ఈ సమస్యను గుర్తించడానికి ఏఐ రెడీ అవుతోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మనిషి వాయిస్‌ను బట్టి వారు డిప్రెషన్‌కు లోనవుతున్నారా, లేదా అనేది ఏఐ గుర్తించగలదని వారు తెలిపారు.

ఒకరి మెంటల్ హెల్త్ గురించి తెలుసుకోవడం వైద్యులకు కూడా ఒక్కొక్కసారి ఇబ్బందిగా మారుతుంది. అందుకే పేషెంట్ మెంటల్ హెల్త్ విషయంలో వైద్యులకు సాయంగా ఉండడానికి ఏఐ సిద్ధమవుతోందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ముందుగా డిప్రెషన్‌తో బాధపడుతున్న పేషెంట్ల వాయిస్‌లోని సిగ్నల్స్‌ను ఏఐ స్టడీ చేయనుంది. ఆ తర్వాత మనుషుల వాయిస్ నుండి ఎలాంటి సిగ్నల్స్ వస్తే.. వారు డిప్రెషన్‌లో ఉన్నారని తెలుస్తుందో దానిపై స్టడీ జరగనుంది.


ఇప్పటికే కృత్రిమ మేధస్సు ద్వారా మనుషుల్లోని డిప్రెషన్‌ను కనిపెట్టే పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు. అయితే పురుషులలో 87 శాతం పేషెంట్లను, మహిళల్లో 87.5 శాతం పేషెంట్లను సక్సెస్‌ఫుల్‌గా స్టడీ చేసింది ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్. ముందుగా పేషెంట్లను.. ఒక వర్చువల్ ఏజెంట్ కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. వారు ఇచ్చే సమాధానాన్ని బట్టి, వారి వాయిస్‌ను బట్టి అందులో డిప్రెషన్ బయటపడుతుంది.

ముందుగా పేషెంట్ల వాయిస్‌ను, వారి స్పీచ్‌లోని సిగ్నల్స్‌ను ఏఐ గమనిస్తుంది. ఎన్నో 3డి టెక్నాలజీల సాయంతో ఈ టూల్ ఏర్పాటయ్యిందని శాస్త్రవేత్తలు తెలిపారు. తర్వాత రోజుల్లో డిప్రెషన్‌ను గుర్తించడానికి ఇది కూడా ఒక పరికరంగా మారుతుందని వారు భావిస్తున్నారు. అది మాత్రమే కాకుండా మరెన్నో మెంటల్ హెల్త్ వ్యాధలను గుర్తించడానికి కూడా కృత్రిమ మేధస్సు ఉపయోగపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×