E-Paper
Advertisement

Balakrishna: బాల బాబాయ్ అని పిలిచేవాడు.. కన్నీటిపర్యంతమైన బాలకృష్ణ

Balakrishna: బాల బాబాయ్ అని పిలిచేవాడు.. కన్నీటిపర్యంతమైన బాలకృష్ణ
Advertisement

Balakrishna: సినీ నటుడు తారకరత్న మృతితో నందమూరి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ముఖ్యంగా బాలకృష్ణ తారకరత్న మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు. కన్నీటిపర్యంతమవుతున్నారు. ఆసుపత్రిలో వెన్నంటే ఉండి కంటికిరెప్పలా చేసుకున్నప్పటికీ తారక్ ప్రాణాలు దక్కకపోవడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు.

తారకరత్న అంటే బాలకృష్ణకు చిన్నప్పటి నుంచే ఎంతో ఇష్టం. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు ఉన్నప్పటికీ తారకరత్నపై కాసింత ఎక్కువ ప్రేమ చూపించేవారు. నటుడిగా, వ్యక్తిగతంగా ప్రతి విషయంలోనూ తారకరత్నను వెన్నుతట్టి ప్రోత్సహించేవారు. చేయిపట్టుకొని నడిపించేవారు. తారకరత్న రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడని తెలుసుకొని.. టీడీపీలో గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేశారట బాలయ్య.

Advertisement

ఇంతలోనే తారకరత్న యువగళం పాదయాత్రలో కుప్పకూలిపోవడంతో .. బాలకృష్ణ వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. బెంగళూరులోనూ తారకరత్న వెంటనే ఉంటూ జాగ్రత్తగా చూసుకున్నారు. రాజకీయాలు, సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్యం గురించి ఆరా తీస్తుండేవారు. విదేశాల నుంచి వైద్యులను కూడా రప్పించి చికిత్స అందించారు.

ఇక తారకరత్న పిలుపును గుర్తు చేసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు బాలయ్య. బాల బాబాయ్ అంటూ తనను ఆప్యాయంగా పిలిచేవాడని.. ఇక ఈ పిలుపు వినబడదన్న ఊహను తట్టుకోలేకపోతున్నానని చెప్పారు. పూర్తిగా కోలుకొని మృత్యుంజయుడిలా తిరిగి వస్తాడని ఆశించామని.. కానీ ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్తాడని ఊహించలేదని కన్నీళ్లుపెట్టుకున్నారు.

Taraka Ratna: తారకరత్నకు ప్రముఖుల సంతాపం..

Taraka Ratna: పెద్దలు నో చెప్పినా.. అలేఖ్యను పెళ్లాడిన తారకరత్న

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×