BigTV English

Devotee Rules : భక్తులు చేయకూడని పనులు తెలుసా?

Devotee Rules : భక్తులు చేయకూడని పనులు తెలుసా?

Devotee Rules : దేవాలయాల్లో ఆగమశాస్త్రం ప్రకారము ఎవరైనా సరే పాదరక్షలు అంటే చెప్పులు, బూట్లు ధరించి రావడం తప్పు. పూజారులు, భక్తులు, అధికారులు అందరికి ఇదే నియమం వర్తిస్తుది. ఎలాంటి వ్యక్తులైనా సరే చెప్పులు వేసుకుని లోపకి ప్రవేశించరాదు. దేవాలయమునకు ప్రదక్షణలు చేసిన తర్వాతే లోపలికి ప్రవేశించాలి. తలపాగా, టోపిధరించి వెళ్లకూడదు ఆలయం లోపలకి వెళ్లరాదు. అలాగే చేతుల్లో ఏవైనా ఆయుధాలను పెట్టుకుని అస్సలు ప్రవేశించకూడదు. తినుబండారాలు తీసుకుని గుడికి వెళ్లరాదు. ఆలయంలో దైవసన్నిధికి ఒట్టి చేతులతోగాని, కుంకుమ పెట్టుకోకుండా గాని, దేవాలయంలోకి ఎట్టి పరిస్థితుల్లో ప్రవేశించరాదు.


అలాగే దేవాలయము తీసి ఉన్న సమయంలో నిద్ర పోకూడదు. గుడిలో అడుగుపెట్టిన తర్వాత పగలు, నిద్రపోవడం, కాళ్లు చాపు కుని కూర్చోవడం వంటి పనులను కూడా చేయరాదు. అలాగే ఆలయ ప్రాంగణంలో మల, మూత్ర విసర్జన, ఉమ్మివేయుట అపచారంగా భావిస్తారు. దేవాలయమున దైవసన్నిధిలోనే తోటి భక్తులతో కాని ఇంకా ఎవరితినైనా గొడవలు పెట్టుకోవడం, కేకలు వేయడం చేయకూడదు .అలాగే దేవాలయ ప్రాంగణంలో ఏ జీవికీ హాని కలిగించడం లేదా హింసించడం వంటివి అస్సలు చేయకూడదు. ఇతరులతో దేవాలయముపై విమర్శలు, దైవదూషణ, పరనింద చేయకూడదు.

దేవాలయ ప్రాంగణంలో అహంకారం, గర్వంతో, అధికార దర్పంతో అస్సలు ఉండకూడదు. ఒకే చేతితో నమస్కారం చేయరాదు. అధికార గర్వంతో దేవాలయమున కూడని సమయాన అకాలమందున దైవప్రాకారంలో ప్రవేశించి అకాల సేవలను చేయించరాదు. అలాగే, దేవుని ఎదుట ప్రుష్ఠభాగం చూపిస్తూ కూర్చోకూడదు. అధికార దర్పము చూపించి తనఉనికి మరచి ప్రవర్తించరాదు. తనకుభక్తి శ్రద్దలేకుండా తన ద్రవ్యం, తాను సంపాదించని పూజా ద్రవ్యములతో పూజలు చేయించుకొనరాదు.


దేవాలయములందు ఆగమవిధులను అనుసరించి నడచుకొనవలెను. ఆర్జిత సేవలయందు దేవాలయమున సహస్రనామ, అష్టోత్తరశతనామ, ,అభిషేకము,హోమములకు, వివిధపూజాసేవలకై, తప్పనిసరిగా అందరుటిక్కేట్టు తీసుకోవడం, సంప్రదాయ బట్టలను మాత్రమే ధరించాలి.

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×