BigTV English

Parliament Winter Sessions : 7నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. ఆమోదానికి 16 బిల్లులు..

Parliament Winter Sessions : 7నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. ఆమోదానికి 16 బిల్లులు..

Parliament Winter Sessions : ఈనెల 7నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. దీంతో అధికార, విపక్షాలు సన్నద్ధం అవుతున్నాయి. ఈ సెషన్స్‌లో 16 బిల్లులకు ఆమోదం తెలుపుకోవాలనే యోచనలో ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. ప్రభుత్వం చేసిన పనులను పార్లమెంట్ నుంచి ప్రజలకు వివరించాలని చూస్తోంది.


మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్.. పార్లమెంట్ వేదికగా ప్రజాసమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధం అవుతోంది. పలు కీలక అంశాలను లేవనెత్తాలని నిర్ణయించుకుంది. నిత్యావసర ధరలు పెరగడం, ఆర్ధిక మందగమనం, రూపాయి పతనం, నిరుద్యోగం, ప్రభుత్వ సంస్థల అమ్మకంపై కేంద్రాన్ని ప్రశ్నించేందుకు కాంగ్రెస్ రెడీ అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్థానిక సమస్యలు, కేంద్ర ప్రభుత్వ హామీలపై బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయాలని చూస్తున్నాయి. విభజన హామీల సమస్యలను తెలుగు రాష్ట్రాల ఎంపీలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఉన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు అధికార, విపక్షాలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. దీంతో సభా సమరంతో..వింటర్ సెషన్స్ హాట్ హాట్‌గా సాగనున్నాయి


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×