Big Stories

Eating Rules : భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదా….

Share this post with your friends

Eating Rules : మనశాస్త్రాలు,పురాణాలు మనకు చాలా విషయాలుచెప్పాయి. కానీ వాటి గురించి మనకు చెప్పేవాళ్లులేరు. మనం అన్నం ఎలా తినాలి, మంచం మీద ఎటు వైపు పడుకోవాలన్న విషయాలు కూడా మార్కేండ పురాణంలో సోదాహరంగా వివరించారు. బాసినమటం వేసుకుని రెండు కాళ్లకు మధ్యలో కంచం పెట్టుకుని భోజనం చేయమని శాస్త్రం చెబుతుంది. అలాగే అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.కారణం అన్నం తినేటప్పుడు మాట్లాడితే ఆ పదార్ధాలు ఊపరితిత్తుల్లోకి వెళ్తాయి. అందువల్ల ఆహారాన్ని సుఖంగా తినలేం. అన్నం తినేటప్పుడు మాట్లాడితే నమలడానికి ఇబ్బంది కలుగుతుంది. మెతుకులు నమలకుండా లోపలకి వెళ్లినా,ఊపరి తిత్తులోకి చేరినా జీర్ణ వ్యవస్థలోకి సక్రమంగా వెళ్లలేకపోయినా సమస్యలు వస్తాయి. రక్తం సరిగ్గా పట్టకపోవడంతో శారీరకంగా చాలా సమస్యలు వస్తాయి. అందుకే భోజనం చేసేటప్పుడు మౌనంగా తినమని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఈ నియమాలు పాటించడం వల్ల పూర్వకాలంలో జనమంతా ఎక్కువగా ఆరోగ్యంగా ఉండేవారు. భోజనం చేసేటప్పుడు తూర్పు ముఖం కూర్చోవాలి. ఆ వైపు ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే పితృదేవతలు ఉండే దక్షిణ దిక్కు వైపు నుంచి కూర్చుని తినవచ్చు. భోజనాన్ని ఎత్తైన దాని మీద కూర్చుని నోటికి ఎదురుగా విస్తరి లేదా కంచం పెట్టుకుని భోజనం చేస్తే అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. పీటలేదా చాప లాంటి వాటిపై కూర్చుని తినడం వల్ల కడుపుకి ఎంత కావాలో తెలుస్తుంది. అంతే తినగలుగుతారు. భోజనం చేస్తూ మాట్లాడుతుంటే నోటిలో లాలాజలం ఊరదు. దాంతో ఆహారం అజీర్ణం కాక అనేక రోగ సంబంధిత సమస్యలు వస్తాయి.

అలాగే అమావాస్య, పౌర్ణమిలలో తక్కువ భోజనం చేయడం ఆరోగ్యకరమని శాస్త్రాలు చెబుతున్నాయి.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Latest News