Dhansuh: ధనుష్ కి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఎన్నో సినిమాలతో తెలుగు ప్రేక్షకులు కూడా దగ్గరయ్యారు. ధనుష్ 25వ సినిమా రఘువరన్ బీటెక్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం ధనుష్ ఏ సినిమా చేసిన అది తెలుగులో విడుదలవుతుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో డైరెక్ట్ గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు ధనుష్.
ఒకవైపు నటుడుగా, సింగర్, దర్శకుడుగా తన ప్రతిభను చూపిస్తూ ప్రేక్షకులను ఆకర్షించుకుంటున్నాడు. దర్శకుడుగా కూడా ధనుష్ చేసిన సినిమాలు విపరీతమైన సక్సెస్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఇడ్లీ కడై అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు ధనుష్. ధనుష్ నటించిన రంజనా సినిమా రీ రిలీజ్ అయింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో క్లైమాక్స్
ధనుష్ నటించిన “రంజనా” సినిమా 2013లో విడుదలైంది. రంజన హిందీ రొమాంటిక్ డ్రామా జోనర్. ఈ సినిమాకి ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహించారు. హిందీలో ధనుష్ నటించిన మొదటి చిత్రం ఇది. ఈ సినిమాలో ధనుష్ సరసన సోనమ్ కపూర్ నటించింది. ప్రస్తుతం సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ అవుతున్న తరుణంలో, ఈ సినిమా కూడా రీ రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా క్లైమాక్స్ ను కంప్లీట్ గా మార్చేసింది ఏరోస్ ఎంటర్టైన్మెంట్. ఏరోస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ దీనిని నిర్మించింది. ఈ సినిమాకు ఒక ఆల్టర్నేట్ క్లైమాక్స్ ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసి విడుదల చేశారు.
Also Read: Megastar Chiranjeevi: సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన మెగాస్టార్ చిరంజీవి
మండిపడ్డ ధనుష్
ఇలా ఆల్టర్నేట్ క్లైమాక్స్ అనేది చేయడం వల్ల ధనుష్ మండిపడ్డారు. తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ధనుష్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ.. రాంఝనా సినిమాను పూర్తిగా మార్చి క్లైమాక్స్ తో తిరిగి విడుదల చేయడం నన్ను పూర్తిగా కలవరపెట్టింది. ఈ ఆల్టర్నేట్ క్లైమాక్స్ సినిమా సోల్ కోల్పోయింది, అలానే సంబంధిత పార్టీలు నా స్పష్టమైన అభ్యంతరం ఉన్నప్పటికీ దానితో ముందుకు సాగాయి.
ఇది 12 సంవత్సరాల క్రితం నేను కమిట్ అయిన సినిమా కాదు.
సినిమాలు లేదా కంటెంట్‌ను మార్చడానికి ఏఐ ఉపయోగించడం కళ మరియు కళాకారులు ఇద్దరికీ తీవ్ర ఆందోళన కలిగించే ఉదాహరణ.
ఇది కథ చెప్పడం యొక్క సమగ్రతను మరియు సినిమా వారసత్వాన్ని బెదిరిస్తుంది. భవిష్యత్తులో ఇటువంటి పద్ధతులను నిరోధించడానికి కఠినమైన నిబంధనలు అమలులోకి వస్తాయని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. అంటూ ధనుష్ స్పందించారు. ఇక ధనుష్ ఆవేదనను అర్థం చేసుకొని ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. దర్శకుడు కూడా ఇలా క్లైమాక్స్ మార్చడానికి అనుమతి ఇవ్వలేదు అని తెలుస్తుంది.
For the love of cinema 🙏 pic.twitter.com/VfwxMAdfoM
— Dhanush (@dhanushkraja) August 3, 2025