BigTV English

ITR Documents : ఐటీఆర్ ఇప్పటికీ ఫైల్ కాలేదు.. ఎలాంటి డాక్యుమెంట్లు కావాలో తెలియడం లేదు.. ఇది చదవండి

ITR Documents  : ఐటీఆర్ ఇప్పటికీ ఫైల్ కాలేదు.. ఎలాంటి డాక్యుమెంట్లు కావాలో తెలియడం లేదు.. ఇది చదవండి
Documents For Income Tax Return (ITR)

ITR Documents : ప్రతి ఒక్కరూ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిందే. అది జీతం తీసుకుంటున్న ఉద్యోగి అయినా… చిన్న వ్యాపారి అయినా.. బడా కార్పొరేట్ వ్యక్తి అయినా సరే. ప్ర‌తి ఆర్థిక సంవ‌త్స‌రంలో త‌మ ఐటీ రిట‌ర్న్స్ త‌ప్ప‌నిస‌రిగా స‌మ‌ర్పించాలి. ప్ర‌తి ఏటా ఏప్రిల్‌-జూలై మ‌ధ్య ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ఐటీ రిట‌ర్న్స్ ఫైల్ చేయాలి. అయితే, వీటి కోసం ఏ డాక్యుమెంట్స్ కావాలన్న దానిపై కొందరికి స్పష్టత లేదు.


ఐటీఆర్ ఫైల్ చేయడానికి పాన్ కార్డ్, ఆధార్ కార్డు, ఫామ్-16ఏ వంటి పత్రాలు ఉండాలి. ప్ర‌తి వ్య‌క్తి త‌మ ఇన్‌‌కమ్ డాక్యుమెంట్స్, ఐటీఆర్‌-అనుబంధ ముఖ్య ప‌త్రాలు ఐటీ విభాగానికి స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

ఆదాయాన్ని బ‌ట్టి ఇన్ కమ్ ట్యాక్స్ శ్లాబ్స్ ఉంటాయి. తీసుకునే సాలరీ, ఇంటి రెంటు, వ‌డ్డీ ఆదాయం, పెట్టుబ‌డులు పెడితే వాటిపై లాభం, కంపెనీ షేర్లు ఉంటే వాటిపై లాభం.. ఇలా అన్ని అంశాలు ట్యాక్స్‌ ప‌రిధిలోకి వ‌స్తాయి. ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేయ‌డానికి జూలై 31వ తేదీ తుది గ‌డువు. ఈ గడువు లోపు ఐటీఆర్ ఫైల్ చేయ‌కపోతే.. భారీ పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది.


ఇంతకీ ఐటీ రిట‌ర్న్స్ కు ఏ డాక్యుమెంట్స్ కావాలి:
ఐటీఆర్ ఫైల్ చేయ‌డానికి పాన్‌ కార్డ్ తప్పనిసరి. పాన్ కార్డ్ స‌మ‌ర్పించ‌క‌పోతే మీ ఆదాయంలో 20 శాతం ప‌న్ను కింద డిడ‌క్ట్ చేసే అధికారం బ్యాంకుల‌కు ఉంటుంది. పాన్ కార్డు అందిస్తే, 10 శాతం ఆదాయం డిడ‌క్ట్ చేస్తాయి. దీంతో పాటు ఆధార్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

అడ్వాన్స్‌గా ఐటీఆర్ ఫైల్ చేయ‌డానికి బ్యాంక్ స్టేట్‌మెంట్‌ కావాలి. బ్యాంకుల నుంచి ఇంట‌రెస్ట్ స‌ర్టిఫికెట్లు కూడా తీసుకోవాలి. ఆదాయం ప‌న్ను చ‌ట్టంలోని 80టీటీఏ సెక్ష‌న్ ప్ర‌కారం బ్యాంక్‌, కోఆప‌రేటివ్ బ్యాంక్‌, పోస్టాఫీసుల్లోని ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలు, పొదుపు మొత్తాల‌పై వ‌చ్చే వ‌డ్డీ ఆదాయం నుంచి రూ.10 వేల వ‌ర‌కు డిడ‌క్ట్ చేయ‌వ‌చ్చు. ఉద్యోగులకు ఫామ్ 16ఏ ఇస్తారు. ఉద్యోగుల వేత‌నాల నుంచి డిడ‌క్ట్ చేసిన టీడీఎస్‌ను ఆదాయం ప‌న్నుశాఖ‌కు డిపాజిట్ చేశారని చెప్పడానికి ఇదే ఆధారం.

ఇక వీటితో పాటు మ్యూచువ‌ల్ ఫండ్స్‌, షేర్లు, బంగారం, ఆస్తులు విక్ర‌యిస్తే వ‌చ్చే లాభాల‌పై త‌ప్ప‌నిస‌రిగా పెట్టుబ‌డిపై లాభాల‌కు ప‌న్ను చెల్లించాలి. వీటికి సంబంధించిన డిటైల్స్ కూడా ఇవ్వాలి.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×