Big Stories

Snoring: గుండెపై గురక ప్రభావం పడుతుందా?

Snoring:చాలా మంది గురక సమస్యతో బాధపడుతుంటారు. గురక వల్ల మన ఇంట్లో వాళ్లు కూడా ఇబ్బంది పడుతుంటారు. గురక సాధారణం అనుకుంటే పొరపాటే అంటున్నారు వైద్యులు. కొందరిలో గురక గాలి మార్గాలను పూర్తిగా, పాక్షికంగా మూసేసి నిద్రలేమికి కూడా కారణం అవుతుంది. దీంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. గురక పెడుతున్నట్టు మనకు తెలియకపోయినా పక్కవాళ్లకు మాత్రం అది నరకమే అని చెప్పాలి. ప్రతి ముగ్గురు పురుషుల్లో ఒకరు, ప్రతి నలుగురు స్త్రీలలో ఒకరు రాత్రి గురక పెడుతున్నట్లు సర్వేల్లో వెల్లడైంది. అప్పుడప్పుడు గురక వస్తే ప్రాబ్లమ్‌ లేదు కానీ దీర్ఘకాలం ఉంటే మంచిది కాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఎక్కువకాలం గురక వస్తుంటే ముందుగానే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది. అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అనే దీర్ఘకాలిక స్థితి ఇది కారణం అవుతుంది. ఇది ముఖ్యంగా ఊపిరితిత్తులు, గుండెపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుంది. గురకపెట్టే వారికి స్లీప్ అప్నియా ఉండకపోవచ్చు. అయితే ఎవరైనా ఉక్కిరిబిక్కిరి చేయడం, గురక, నిద్రలేమి, పగటిపూట నిద్రపోయే లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి. దీర్ఘకాలిక గురక ఊపిరితిత్తులు, గుండె, మెదడుకు ఆక్సిజన్ సరఫరాని తక్కువ చేస్తుంది. ఇది అధిక రక్తపోటు, మధుమేహంతో పాటు పనిలో ఆసక్తి లేకపోవడం, రోడ్డు దాటడంలో బద్దకంలాంటి వాటితో ప్రమాదాలకు కారణమవుతుంది. గురక ఊబకాయం సమస్యను తెచ్చిపెడుతుంది. అంతేకాకుండా తరచూ అలసిపోవడం, నీరసంగా ఉండటం, నిద్రతో ఉన్నట్లు కనిపించడం జరుగుతుంది. సరైన చికిత్స తీసుకుంటే గురక నుంచి బయటపడవచ్చు. గురక సమస్యకు పరిష్కారంగా కంటిన్యూయస్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెజర్ పరికరాలు, బిల్వెల్‌ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెజర్ పరికరాలు దొరుకుతాయి. ఇవి మనం నిద్రిస్తున్నప్పుడు బాగా ఊపిరి పీల్చుకోవడంలో సహాయపడతాయి. కొందరికి మాత్రం శస్త్రచికిత్స అవసరం అవుతుంది. జీవనశైలిలో మార్పులు, వ్యాయామం, అలెర్జీలకు చికిత్స తీసుకోవడం వల్ల నిద్ర నాణ్యతను పెంచుకుని గురక సమస్య తగ్గించుకోవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News