Water Benefits: పుట్టుక, మరణం మన చేతుల్లో ఉండదు. కానీ మన ఆరోగ్యం మాత్రం మన చేతుల్లోనే ఉంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండడానికి సరైన పోషకాహారం, సరిపడ నిద్ర ఉండేలా చూసుకోవాలి. అయితే, మనం సరైన సమయంలో తాగే నీరు కూడా మంచి ప్రయోజనాలు కలిగిస్తుంది. మరి ఏ సమయంలో నీరు తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దామా!
అలవాటుగా మారాలి..
ఉదయం నిద్ర లేవగానే రెండు గ్లాసులు నీరు తాగితే.. అంతర్గత అవయవాల సక్రియానికి సహాయపడుతుంది. అలాగే భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు నీరు తాగితే.. ఆ నీరు జీర్ణక్రియను సులభం చేస్తుంది. ఇక స్నానికి ముందు కూడా నీరు తాగితే.. రక్తపోటును తగ్గిస్తుంది. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు నీరు తాగితే.. గుండెపోటును నివారించవచ్చు.
రోగాలకు చెక్..
నీరు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. అయితే, నీటి వల్ల కూడా కొన్ని రోగాలను మాయం చేయవచ్చని చాలా తక్కువ మందికే తెలుసు. కండరాలు సంకోచించడం (కొంకర్లు) లేదా దూద తిమ్మిరి వచ్చినప్పుడు వాటర్ ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. అలాగే రాత్రిళ్లు కాళ్లు తిమ్మిర్లు పడితే.. లేచి తగినన్ని నీళ్లు తాగాలి.