Ear Buds : కుర్రకారుకు గుడ్ న్యూస్. లేటెస్ట్ టెక్నాలజీతో యూకే బేస్డ్ టెక్నాలజీ దిగ్గజం నథింగ్ కంపెనీ రూపొందించిన ఇయర్ బడ్స్ భారతీయ మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. నథింగ్ ఇయర్ (స్టిక్) ఇయర్ బడ్స్ పేరుతో ఆ కంపెనీ వీటిని ఈనెల 28న లాంచ్ చేసింది. అమెరికా, బ్రిటన్, యూరోప్ మార్కెట్లో నవంబర్ 4న వీటి అమ్మకాలు మొదలు కానున్నాయి. ఇక ఇండియా సహా 40 దేశాల్లో నవంబర్ 17న అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. నథింగ్ ఇయర్(స్టిక్) ఇయర్ బడ్స్ కేస్ బరువు జస్ట్ 4.4 గ్రామ్స్ మాత్రమే. అంతేకాదు దుమ్ము, నీరు అంటుకోకుండా IP54 కోటింగ్ ఉంటుంది. వీటి ధర మాత్రం కాస్త ఎక్కువే. 8,499 రూపాయలకు వీటిని ఫ్లిప్ కార్ట్, మింత్రాలో బుక్ చేసుకోవచ్చు.
దీనికి చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. మ్యూజిక్ ఎంజాయ్ చేసే కుర్రకారుకు ఇదో మంచి గిఫ్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీని ప్లే టైమ్ 29 గంటలు ఉంటుంది. ట్రూ వైర్ లెస్ ఇయర్ బడ్స్ టాక్ టైమ్ 3 గంటలు వస్తుంది. కేవలం మ్యూజిక్ ను 7 గంటలపాటు ఆస్వాదించవచ్చు. అంతేకాదు ఇయర్ బడ్స్ తో పాటు వచ్చే కేస్ ద్వారా మరో 22 గంటల ఎక్ట్రా ఛార్జింగ్ ను పొందొచ్చు. ఈ కేస్ ని కేవలం 10 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే… రెండు గంటలపాటు మ్యూజిక్ ని ఎంజాయ్ చేయొచ్చు.
ఇక ఈ ఇయర్ బడ్స్ లో 12.6 ఎంఎం డ్రైవర్స్ అమర్చారు. దీని వల్ల అదిరిపోయే సౌండ్ క్వాలిటీని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక బేస్ లాక్ టెక్నాలజీ, క్లియర్ వాయిస్ సిస్టం ఇందులో ఉంటాయి. రెండు ఇయర్ బడ్స్ పైనా ముఖ్యంగా కంట్రోల్ బటన్స్ ఇచ్చారు. ఈ బటన్స్ తో మ్యూజిక్ ను ప్లే చేసుకోవచ్చు. అవసరం అనుకుంటే పాజ్ చేయొచ్చని కంపెనీ తెలిపింది. వీటన్నింటితోపాటు వాయిస్ అసిస్టెంట్ ఫెసిలిటీ కూడా ఉంది. వీలునిబట్టి వాల్యూమ్ మార్చుకునే వెసులుబాటు కల్పించారు. ఇదే కంపెనీ ఇదివరకే నథింగ్ ఫొన్ 1 తీసుకొచ్చింది