Foxtail Millet Benefits : సాధారణంగా మనం ఎక్కువ పాలీష్ చేసిన బియ్యాన్ని తింటుంటాం. ఇలా చేయడం వల్ల అందులోని పోషక విలువలు తగ్గిపోతాయి. దీంతో అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. పాత రోజుల్లో అయితే కేవలం బియ్యమే కాకుండా కొర్రలు, రాగులు, సజ్జలు ఇలా చిరుధాన్యాలతో జావ, సంకటి చేసుకుని తినేవాళ్లు. అందుకే వాళ్లు అంత ఆరోగ్యంగా ఉండేవారు. ముఖ్యంగా కొర్రలు ఆరోగ్యానికి ఎంతో మంచివని నిపుణులు చెబుతున్నారు. ఈ కొర్రల్లో ఉండే మాంసకృతులు, కాల్షియం, మాంగనీస్, ఐరన్, మెగ్నీషియం, రైబోఫ్లేవిన్, ధైమిన్లు ఎక్కువ సంఖ్యలో పీచు పదార్థాన్ని కలిగి ఉంటాయి. వరి బియ్యం వండినట్టుగానే కొర్ర బియ్యాన్ని కూడా వండుకోవచ్చు. కొర్రలు తీపి, వగరు రుచితో ఉంటాయి. ఇందులో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చిన్నారులు, గర్భిణీ స్త్రీలకు ఇది మంచి ఆహారం అని చెప్పవచ్చు. కడుపు సంబంధిత వ్యాధులకు కొర్రలు తినడం చాలా మంచిది, కడుపులోని రోగాలను ఇవి నయం చేస్తాయి. కడుపులో నొప్పి, మూత్రంలో మంట, ఆకలి కాకపోవడం, అతిసార వ్యాధికి కొర్రలతో చెక్ పెట్టవచ్చు. ప్రతిరోజూ కొర్రలు తినడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. అల్జీమర్స్ వ్యాధి పెరుగుదలను తగ్గించే విటమిన్ బీ 1 కొర్రల్లో ఎక్కువశాతం ఉంటుంది. అంతేకాకుండా ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని కూడా పెంచుతాయి. నాడీవ్యవస్థపై మంచి ప్రభావాన్ని చూపే మోరెల్ విటమిన్ ఈ కొర్రల్లో ఉంటుంది. మానసిక దృక్పథానికి కూడా ఇవి సహాయపడతాయి. బెల్స్ పాల్సీ, మల్టిపుల్ స్క్లెరోసిస్‌లాంటి ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి ఈ కొర్రలు ఎంతగానో సహాయపడతాయి. నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి ఇందులో ఉండే ప్రోటీన్ సహాయపడుతుంది. కొర్రలను నిత్యం తీసుకోవడం వల్ల వివిధ రకాల క్యాన్సర్లు కూడా రాకుండా మనల్ని కాపాడుతాయి. అంతేకాకుండా కీళ్ల నొప్పులు, మతిమరుపు ఉండవు. కొర్రల్లో మాంసకృత్తులు, ఐరన్ ఎక్కువశాతం ఉంటుంది. దీంతో రక్తహీనత తగ్గుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణశక్తిని పెంచుతాయి. రక్తాన్ని పెరిగేలా చేస్తాయి. నడుముకు కూడా కొర్రలు మంచి శక్తిని ఇస్తాయి.