Big Stories

Elon Musk Falls To Second Richest Person : అయ్యో మస్క్.. ఆస్తి, హోదా కరిగిపాయె..

Elon Musk Falls To Second Richest Person : అనుకున్నంతా అయింది. ట్విట్టర్ కొన్నప్పటి నుంచి కరిగిపోతూ వస్తున్న ఎలాన్ మస్క్ ఆస్తి విలువ… ఇప్పుడు మరింత తగ్గిపోయింది. ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానానికి పడిపోయేంతగా… ఆయన ఆస్తి హారతి కర్పూరమే అయింది. బ్లూమ్‌బెర్గ్‌ తాజాగా విడుదల చేసిన ప్రపంచ ధనవంతుల జాబితాలో ఫ్రెంచ్‌ వ్యాపారవేత్త బెర్నార్డ్ తొలిస్థానంలో నిలిచారు.

- Advertisement -

ప్రస్తుతం మస్క్‌ సంపద 168.5 బిలియన్‌ డాలర్లు. బెర్నార్డ్‌ సంపద విలువ 172.9 బిలియన్‌ డాలర్లు. మస్క్ కన్నా 4.4 బిలియన్ డాలర్లు ఎక్కువ సంపదతో బెర్నార్డ్‌ మొదటి స్థానంలో నిలిచారు. ట్విట్టర్‌ కొన్నప్పటి నుంచి మస్క్ వ్యక్తిగత సంపద విలువ తగ్గుతూ వస్తోంది. 44 బిలియన్‌ డాలర్లతో ట్విటర్‌ను కొనేందుకు… 19 బిలియన్‌ డాలర్ల విలువైన టెస్లా షేర్లను రెండు దఫాలుగా అమ్మేశాడు… మస్క్. దానికి తోడు టెస్లా షేర్ల విలువ భారీగా పతనం కావడంతో… మస్క్ సంపద అనూహ్యంగా కరిగిపోయింది. 340 బిలియన్ డాలర్ల సంపదతో కొన్నాళ్ల కిందట ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించిన మస్క్… ఇప్పుడు సగానికి పైగా సంపద తగ్గిపోయి… రెండో స్థానానికి పరిమితమయ్యాడు.

- Advertisement -

ఇక బెర్నార్డ్‌ విషాయనికొస్తే… ఈయన కూడా చాన్నాళ్లుగా ప్రపంచ కుబేరుల జాబితాలో కొనసాగుతున్నారు. అయితే ఇతర బిలియనీర్ల తరహాలో బెర్నార్డ్ సంపద అనూహ్య మార్పులకు లోనవదు. క్రమంగా సంపద పెంచుకోవడమే ఈయన స్పెషాలిటీ. ప్రపంచంలో అత్యంత ఖరీదైన వస్తువుల బ్రాండ్‌కి పెట్టింది పేరైన LVMH కంపెనీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు… బెర్నార్డ్‌. లూయిస్‌ విటన్‌, సెఫోరా సహా మొత్తం 70 ఫ్యాషన్‌ బ్రాండ్లు LVMH ఆధ్వర్యంలోనే ఉన్నాయి. షాంపేన్‌, వైన్‌, స్పిరిట్‌, ఫ్యాషన్‌, లెదర్‌ వస్తువులు, చేతి గడియారాలు, ఆభరణాలు, సుగంధ ద్రవ్యాలు, సౌందర్య ఉత్పత్తులను అమ్మే LVMHకు ప్రపంచవ్యాప్తంగా 5,500 స్టోర్లు ఉన్నాయి. మౌనంగా తన పని తాను చేసుకుపోవడమే తప్ప… పెద్దగా హడావిడి చేయరు.. 73 ఏళ్ల బెర్నార్డ్‌.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News