Big Stories

Space Program : భూమిపై ఎంత నీరుంది? అంతరిక్షం నుంచి సర్వేకు సిద్ధమైన నాసా

Space Program : భూమిపైన ఎంత నీరుంది? 71 శాతం అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. భూమి 29 శాతం ఉంది. ఇప్పటికీ ఇవే లెక్కలు. కానీ నిజంగా 71 శాతం నీరుందా? ఉంటే సముద్రంలో ఎంతుంది? నదులు, సరస్సులు, ప్రాజెక్టుల్లో ఎంత ఉంది? దీన్ని కచ్చితమైన అంచనాలతో కొలవాలనుకుంటోంది నాసా. తొలిసారిగా అంతరిక్షం నుంచి నీటి సర్వే చేపట్టేందుకు రెడీ అయింది. ఇందుకోసం స్వాట్ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తోంది. ఈ ఉపగ్రహం 15 ఎకరాల కంటే పెద్ద సరస్సులు, 330 అడుగుల వెడల్పు ఉన్న నదులను పరిగణనలోకి తీసుకుని నీటిని అంచనా వేస్తుంది. మొత్తంగా దాదాపు 21 లక్షల కిలోమీటర్ల మేర ఉన్న నదులు, సరస్సులలోని నీటి లెక్కలు తీస్తుంది ఈ ఉపగ్రహం.

- Advertisement -

స్వాట్ ఉపగ్రహ ప్రయోగం ఇవాళ (డిసెంబర్ 16న) చేపడుతోంది నాసా. అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా, ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంయుక్తంగా ఈ ప్రయోగాన్ని చేపడుతున్నాయి. స్వాట్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి మోసుకెళ్లి కక్షలోకి ప్రవేశ పెట్టేందుకు స్పేస్ ఎక్స్ కు చెందిన అత్యంత శక్తివంతమైన ఫాల్కన్ 9 రాకెట్ ని ఉపయోగించుకుంటోంది. ఎస్.యు.వి. కారు సైజులో ఉండే ఈ ఉపగ్రహం అంతరిక్షం నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నీటి వనరులు, వాటిలో నీరు ఎంత శాతం ఉందనేది శాస్త్రీయంగా లెక్కగడుతుంది. ఆ వివరాలను నాసాకు చేరవేస్తుంది.

- Advertisement -

నిజానికి ఈ ఉపగ్రహాన్ని డిసెంబర్ 15న ప్రయోగించాల్సి ఉంది. కానీ రాకెట్ ఇంజన్లలో తేమ ఉండడాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు రాకెట్ ప్రయోగాన్ని ఒకరోజు వాయిదా వేశారు. గురువారమే ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టాలని అన్ని ఏర్పాట్లు చేశారు. కాలిఫోర్నియాలోని వాండెర్ బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ లో ఫాల్కన్ 9 రాకెట్ ను లాంచ్ పాడ్ మీద పెట్టారు. కానీ గత కొన్ని రోజులుగా తుఫాన్ ప్రభావంతో వీస్తున్న బలమైన గాలుల వల్ల రాకెట్లోని రెండు మెర్లిన్ ఇంజిన్లలో తేమ ఉన్నట్లు గుర్తించిన సైంటిస్టులు… ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News