BigTV English

ELSS Or PPF : ఈఎల్ఎస్ఎస్ బెటరా లేక పీపీఎఫ్ మంచిదా? తేడా ఏంటి, లాభాలేంటి?

ELSS Or PPF : ఈఎల్ఎస్ఎస్ బెటరా లేక పీపీఎఫ్ మంచిదా? తేడా ఏంటి, లాభాలేంటి?
ELSS Or PF

ELSS Or PPF : ఈఎల్ఎస్ఎస్ లేక పీపీఎఫ్ అనేవి రెండు అధిక-రాబడి, పన్ను ఆదా చేసే పెట్టుబడి పథకాలు. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ లేదా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల ఆదాయపన్ను చట్టం లోని సెక్షన్ 80సి కింద ఇన్వెస్టర్లకు లక్షన్నర రూపాయల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.


ఇంతకీ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ అంటే ఏంటి? ఇదొక మ్యూచువల్ ఫండ్ స్కీం. పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని అధిక రాబడి కోసం ఈ పథకంలో పెట్టుబడి పెడుతుంటారు. ఇందులో రెండు లాభాలు. ఒకటి.. పెట్టిన పెట్టుబడి పెరుగుతూనే ఉంటుంది. రెండోది ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఏడాదికి కనీసం 46వేల 800 రూపాయలు ట్యాక్స్ బెనిఫిట్ గా ఆదా చేసుకోవచ్చు.

ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్  పెట్టుబడులకు మూడు సంవత్సరాల లాక్-ఇన్ పిరియడ్ ఉంటుంది. ఇందులో రిటర్న్స్ మార్కెట్-లింక్డ్ కాబట్టి రిస్క్ ఉంటుంది రివార్డ్ కూడా ఉంటుంది. పైగా ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి క్లోజ్-ఎండెడ్, రెండోది ఓపెన్-ఎండెడ్. క్లోజ్-ఎండెడ్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ కోసం, ఎన్ఎఫ్ఓ జారీ చేస్తారు. ఆ సమయంలో మాత్రమే పెట్టుబడి పెట్టాలి.  ఓపెన్-ఎండెడ్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ కోసం, యూనిట్లను నేరుగా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ద్వారా ట్రేడ్ చేయవచ్చు. ఈఎల్ఎస్ఎస్ లో పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. అయితే, సంవత్సరానికి లక్షకు మించి చేసిన లాభాలపై 10 శాతం పన్ను ఉంటుంది.


స్మాల్ సేవింగ్స్ చేసే వ్యక్తులే లక్ష్యంగా.. ఒక లాంగ్ టర్మ్ సేవింగ్స్ స్కీమ్ తీసుకొచ్చింది నేషనల్ సేవింగ్స్ ఇన్‌స్టిట్యూట్. పీపీఎఫ్ అకౌంట్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద లక్షన్నర వరకు పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేయవచ్చు. ఇందులో పెట్టుబడికి లాకిన్ పిరియడ్ 15 సంవత్సరాలు. 5వ సంవత్సరం తర్వాత పెట్టుబడిని మెచ్యూరిటీకి ముందుగానే విత్‍డ్రా చేసుకునే అవకాశ ఉంది. పైగా ఈ PPFఅకౌంట్ పై రుణం పొందే సౌకర్యం కూడా ఉంది. సో, పన్ను మినహాయింపులతో పాటు అధిక రాబడులు.. అది కూడా పెద్దగా రిస్క్ తీసుకోనవసరం లేకుండా ఉండాలంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ లేదా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టొచ్చు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×