BigTV English
Advertisement

Young Tiger NTR : ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీకి రూ.100 కోట్లు.. యంగ్ టైగర్ యమ కాస్ట్లీ

Young Tiger NTR : ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీకి రూ.100 కోట్లు.. యంగ్ టైగర్ యమ కాస్ట్లీ
Young Tiger NTR

Young Tiger NTR : ఎన్టీఆర్ ఆస్తి విలువ ఎంతో తెలుసా. అక్షరాలా 450 కోట్లు. టాలీవుడ్‌లో వినిపిస్తున్న టాక్ ఇది. దక్షిణాదిలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోల్లో ఎన్టీఆర్ కూడా ఒకరు. నెలకు కనీసం మూడు కోట్లు సంపాదిస్తున్నాడు ఈ యంగ్ టైగర్. ఇక ఒక్కో సినిమాకు 60 కోట్ల నుంచి 80 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ హిట్ కావడంతో రెమ్యునరేషన్ పెంచేశాడని చెప్పుకుంటున్నారు. కొంతకాలం క్రితం వరకు 12 కోట్లు తీసుకున్న తారక్.. ఆ తరువాత 25 నుంచి 30 కోట్లు తీసుకునేవాడు. రాజమౌళితో ఆర్ఆర్ఆర్ హిట్ అవడంతో రెమ్యునరేషన్ డబుల్ చేశాడు.


ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్. హృతిక్ రోషన్ మెయిల్ లీడ్‌లో వస్తున్న సినిమాకు ఏకంగా 100 కోట్లు అడిగాడని బీటౌన్ కూడా చెబుతోంది. రెమ్యునరేషన్ పక్కా అయితే.. అనౌన్స్ మెంట్ కూడా రావొచ్చంటున్నారు. ఎన్టీఆర్ రేంజ్‌కి 100 కోట్లు కూడా తక్కువే. తెలుగు రాష్ట్రాల్లోనే ఈజీగా వంద కోట్లు దాటేస్తుంది. ఇక మిగతా మార్కెట్లతో కలిపితే… పెట్టే వంద కోట్లకు కొన్నింతల లాభాలు పక్కా. కాకపోతే, ఇలా ఓ హీరోతో కలిసి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడా అనేది చూడాలి.

ఓవైపు సినిమాలు, మరోవైపు యాడ్స్‌లో నటిస్తున్న ఎన్టీఆర్… ఈ మధ్య ప్రాపర్టీలు కొనడంపైనా ఫోకస్ పెట్టాడని తెలుస్తోంది. ఈ మధ్యే హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో 25 కోట్లు పెట్టి ఓ బంగ్లా కొన్నాడని చెప్పుకుంటున్నారు. బెంగళూరులోనూ చాలా ప్రైమ్ లొకేషన్‌లోనూ చాలా ఖర్చు పెట్టి ఓ ప్రాపర్టీ తీసుకున్నాడని చెబుతున్నారు. ఎలాగూ తన తల్లిగారికి కర్నాటకనే కాబట్టి… బెంగళూరులో తీసుకోవడంలో తప్పేం లేదు. ఇక హైదరాబాద్ శివారులోని గోపాలపురంలో ఆరు ఎకరాల ఫామ్ ల్యాండ్ తీసుకుని దానికి బృందావనం అని పేరు పెట్టుకున్నాడు. ఈ ఫామ్ హౌస్ కోసం 9 కోట్లు ఖర్చు పెట్టి.. సకల హంగులు సమకూర్చుకుంటున్నాడని చెబుతున్నారు.


ఇక ఎన్టీఆర్‌కు కార్లు అంటే పిచ్చి. ఈమధ్యే లాంబొర్గిని ఉరుస్ గ్రాఫైట్ కాప్స్యూల్ మోడల్ కారు కొన్నాడు. 3 కోట్ల 16 లక్షలు విలువ చేసే ఈ కారును కొన్న ఫస్ట్ ఇండియన్ మన ఎన్టీఆరే. కార్ల కలెక్షన్ అంటే ఎన్టీఆర్‌కు బాగా ఇష్టం. ఇప్పటికే, 5 కోట్లు పెట్టి నీరో నోక్టిక్ బ్లాక్ కలర్ కారు కొని, 15 లక్షలు ఖర్చు పెట్టి నెంబర్ ప్లేట్ కూడా తీసుకున్నాడు. ఇక ఎన్టీఆర్ కార్ల కలెక్షన్లలో 2 కోట్ల విలువైన రేంజ్ రోవర్, కోటి రూపాయల పోర్షే 718 కేమన్, రెండు కోట్ల రూపాయల బీఎండబ్ల్యూ 720ఎల్‌డి, కోటి విలువైన మెర్సెడెస్ బెంజ్.. వీటితో పాటు 8 కోట్ల రూపాయలతో ఓ ప్రైవేట్ జెట్ కూడా కొన్నాడు. 

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×