BigTV English
Advertisement

Drumstick Leaves Benefits : కూర‌ల్లో ఇది ఉంటే ఎన‌ర్జీ మీ సొంతం

Drumstick Leaves Benefits : కూర‌ల్లో ఇది ఉంటే ఎన‌ర్జీ మీ సొంతం


Drumstick Leaves Benefits(Munagaku) : ప్రస్తుత కాలంలో ప‌ని భారం, మాన‌సిక ఒత్తిడి వ‌ల్ల తొంద‌ర‌గా అల‌సిపోతుంటాం. స‌రైన పోష‌కారం తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల కూడా ఈ స‌మ‌స్య అధికంగా ఉంటుంది. అలాంటివారు. మీరు తినే ఆహారంలో ఇది భాగం చేసుకుంటే ఎంతో ఎన‌ర్జిటిక్‌గా ఉంటారు. మ‌నం రోజూ తీసుకునే కూర‌గాయ‌లు, ఆక‌కూర‌ల్లో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. కొన్ని చెట్ల ద్వారా మ‌న‌కు ఆహారంతో పాటు ఔష‌ధాలు కూడా ల‌భిస్తాయి. అలాంటి వాటిలో మునగ ఒక‌టి. మున‌గాకును ఆకు కూర‌గా, ప‌ప్పులో క‌లెగూర‌గా ఉప‌యోగించుకోవ‌చ్చు. అంతేకాకుండా ప‌చ్చడిగా కూడా చేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు.


ఈ మున‌గాకులో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. వ‌ర్షాకాలంలో మున‌గ ఆకు ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల మ‌న వ్యాధి నిరోధ‌క శ‌క్తి ఎంతో పెరుగుతుంది. అలాగే జ‌లుబు, ద‌గ్గులాంటి స‌మ‌స్య‌ల నుంచి కూడా చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. పాల కూర‌తో పోలిస్తే మున‌గాకులో మూడు రెట్లు అధికంగా ఐర‌న్ ఉంటుంది. అర‌టి పండ్ల‌లో కంటే ఏడు రెట్లు అధికంగా మెగ్నీషియం ఇందులో ఉంటుంది. పాలలో కంటే రెండు రెట్లు ప్రొటీన్లు ఎక్కువ‌గా ఉంటాయి. ఈ ఐర‌న్‌, మెగ్నీషియం మనకు శక్తిని ఇస్తాయి. వెనువెంట‌నే అల‌స‌ట‌కు గురికాకుండా ఇవి మ‌న‌ల్ని కాపాడుతాయి.

మునగాకులో ఎక్కువ‌గా ఉండే పీచు ప‌దార్థం వ‌ల్ల కొంచెం తిన‌గానే క‌డుపు నిండిన‌ట్టు అనిపిస్తుంది. అందుకే ప్ర‌తిరోజు మున‌గాకును మ‌న ఆహారంలో భాగం చేసుకుంటే ఎక్కువ‌గా తినే స‌మ‌స్యే ఉండ‌ద‌ని నిపుణులు అంటున్నారు. ఈ మున‌గాకులో ఉండే క్లోరోజ‌నిక్ ఆమ్లం కొవ్వును తొంద‌ర‌గా క‌రిగిస్తుంది. అంతేకాకుండా షుగ‌ర్ లెవ‌ల్స్‌ను కూడా బాగా నియంత్రిస్తుంది. మ‌న బాడీలోని వ్యర్థ ప‌దార్థాల‌ను బ‌య‌టికి పంపించ‌డంలో బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.


మున‌గాకులోని విట‌మిన్ ఎ మ‌న చ‌ర్మాన్ని చాలా మృదువుగా ఉంచుతుంది. మున‌గాకులోని అమైనో ఆమ్లాలు ప్రొటీన్ ఉత్ప‌త్తి కావ‌డానికి స‌హాయ‌ప‌డ‌తాయి. ఈ ప్రొటీన్ మ‌న‌ జీర్ణశక్తిని మెరుగుప‌రిచి మలబద్ధకాన్ని నివారిస్తుంది. కడుపులోని పుండ్లను, ఇన్‌ఫెక్షన్లను అద్భుతంగా తగ్గిస్తుంది.

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×