Latest UpdatesScience & Technology

Electronic Skin : నిజమైన స్పర్శ అనుభూతినిచ్చే ఎలక్ట్రానిక్ చర్మం..

Electronic Skin

Electronic Skin : ఈరోజుల్లో కృత్రిమంగా తయారు చేసినవాటికి, ప్రకృతిసిద్ధంగా తయారైన వాటికి పెద్దగా తేడా ఉండడం లేదు. కత్రిమంగా తయారు చేసినవే మరింత ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్నాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కూడా. అందుకేనేమో ప్రతీదానికి కృత్రిమంగా ఒక శాంపుల్ అనేది తయారవుతోంది. తాజాగా శాస్త్రవేత్తలు చర్మాన్ని కూడా కృత్రిమంగా తయారు చేశారు. అంతే కాకుండా ఇది చూడడానికి అచ్చం నిజం చర్మంలాగానే ఉంటుందని కూడా అంటున్నారు.

స్టాన్ఫార్డ్ శాస్త్రవేత్తలు అంతా కలిసి ఒక సాఫ్ట్, సాగదీయగలిగే ఎలక్ట్రానిక్ చర్మాన్ని తయారు చేశారు. ఇది మెదడుతో నేరుగా మాట్లాడే ఫీచర్‌తో తయారయ్యిందని చెప్తున్నారు. అంతే కాకుండా నిజమైన చర్మం తాకినప్పుడు మెదడు ఎలాంటి సిగ్నల్స్‌ను పంపిస్తుందో.. ఈ కృత్రిమ చర్మం తాకినప్పుడు కూడా మెదడు అదే విధంగా రియాక్ట్ అయ్యేలాగా శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఎలక్ట్రానిక్ చర్మం పరిశోధనలు మొదటి దశలోనే ఉన్నాయి. ఇవి సక్సెస్‌ఫుల్ అయితే దివ్యాంగులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు.

మామూలుగా మనిషి చర్మం ఎలా ఉంటుంది, ఆ చర్మం వల్ల కలిగిన స్పర్శకు మెదడు ఎలా రియాక్ట్ అవుతుంది.. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే ఈ ఎలక్ట్రానిక్ చేతిని తయారు చేసినట్టు శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ప్రస్తుతం కాళ్లు, చేతులు లేనివారికి కృత్రిమంగా కాళ్లు, చేతులు ఇవ్వగలుగుతున్నాం కానీ.. చర్మం వల్ల కలిగే స్పర్శ అనుభూతిని వారికి అందించలేకపోతున్నాం. ప్రత్యేకంగా వారికోసమే ఈ ఎలక్ట్రానిక్ చర్మం ఉపయోగపడేలా తయారు చేస్తున్నామని శాస్త్రవేత్తలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ‘ఈ స్కిన్’ను పూర్తిస్థాయిలో మెరుగ్గా తయారు చేయడం కోసమే వారు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ స్కిన్ అనేది పూర్తిగా మార్కెట్లోకి రావాలంటే ఇంకా పరీక్షలు చేయాలని శాస్త్రవేత్తలు తెలిపారు. అంతే కాకుండా ఒకసారి మార్కెట్లోకి వచ్చిన తర్వాత కూడా ఈ స్కిన్‌ను ఉపయోగిస్తున్నవారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేలా చేస్తున్నామని వారు హామీ ఇచ్చారు. ల్యాబ్ దశలో మాత్రం ఈ స్కిన్ అనేది మెరుగ్గా తన సామర్థ్యాన్ని చూపించిందన్నారు. ముందుగా ఎలుకలపై ఈ స్కిన్ పరిశోధన జరిగింది. ఇది చర్మ స్పర్శను పల్సెస్ రూపంలో మెదడుకు అందించిందని వారు గమనించారు.

ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది శాస్త్రవేత్తలు.. నేచురల్‌గా కాళ్లను, చేతులను తయారు చేసి దివ్యాంగులను అందించాలని ప్రయత్నాలు చేశారు. కానీ అవేవి పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేదు. అందుకే మనిషి చర్మాన్ని స్ఫూర్తిగా తీసుకొని, దాని వల్ల కలిగే స్పర్శను వారు రీక్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ స్కిన్ అనేది ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ ద్వారా స్పర్శను మెదడుకు తెలియజేస్తుంది కాబట్టి.. ఈ ఫీచర్‌ను అనుభూతి చెందిన దివ్యాంగులు కచ్చితంగా సంతోషిస్తారని శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

Brother: గెటప్ బ్రదర్.. వెరైటీ వెల్‌కమ్స్.. ప్రతీరోజూ సర్‌ప్రైజ్..

Bigtv Digital

Hyderabad: జిమ్‌కు వెళ్లే వారే టార్గెట్.. స్టెరాయిడ్స్ విక్రయిస్తూ ముగ్గురి అరెస్ట్

Bigtv Digital

Immunity Juices : మీ ఇమ్యూనిటీ పెంచే జ్యూసులు ఇవే

BigTv Desk

Leave a Comment