NTPC Recruitment 2025: ఎన్టీపీసీలో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. వెంటనే అకవాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
బీటెక్, గేట్ స్కోర్ ఉన్న వారికి ఇది సువర్ణవకాశం. ఎన్టీపీసీ లిమిటెడ్.. ఫిక్స్ డ్ టర్మ్ ప్రతిపాదికన గేట్-2024 స్కోర్ ద్వారా పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం కల్పిస్తారు. అర్హత ఉన్నఅభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఫిబ్రవరి 3 వ తేదీని దరఖాస్తు గడువు ముగియనుంది.
నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. న్యూఢిల్లీలోని ఎన్టీపీసీ లిమిటెడ్.. ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన గేట్-2024 స్కోర్ ద్వారా భారీగా ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసారి నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 475
ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. పలు విభాగాల్లో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
విభాగాల వారిగా ఖాళీలు:
ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్/ ఇన్ స్ట్రుమెంటేషన్, సివిల్, మైనింగ్ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
ఎలక్ట్రానిక్స్- 135
మెకానికల్- 180
ఎలక్ట్రానిక్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్- 85
సివిల్- 50
మైనింగ్- 25
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు చివరి తేది నాటికి 27 ఏళ్ల మించరాదు.
విద్యార్హత: ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ, ఏఎంఐఈలో 65 శాతం మార్కులతో గుర్తింపు పొంది యూనివర్సిటీ/ ఇన్ స్టిట్యూట్ నుంచి ఫుల్ టైం బ్యాచిలర్ డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది. (ఇది ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 55శాతం మార్కులతో పాసై ఉంటే సరిపోతుంది). 2024 గేట్ స్కోర్ తప్పనిసరిగా ఉండాలి.
జీతం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 జీతం ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: గేట్ 2024 స్కోర్, షార్ట్ లిస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్ఎం, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు 2025 ఫిబ్రవరి 13 తేదిలోగా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్ లో ఎలాంటి సందేహం ఉన్నా అఫీషయల్ వెబ్ సైట్‌ను చూడవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://ntpc.co.in/jobs-ntpc
బీటెక్, గేట్ స్కోర్ అర్హతలున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. దరఖాస్తు గడువు కూడా దగ్గర పడుతోంది. వెంటనే అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఇందులో కనుక ఉద్యోగానికి సెలెక్ట్ అయితే భారీ వేతనం కల్పిస్తారు. నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 జీతం కల్పిస్తారు. ఆలస్యం చేయకుండా వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
ముఖ్యమైనవి:
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 475
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 13
దరఖాస్తు ఫీజు: రూ.300
జీతం: రూ.40వేల నుంచి రూ.1,40,000 వరకు జీతం ఉంటుంది.