Mokshagna Teja:నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వారసుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) సినిమా అప్పుడు వస్తుంది! ఇప్పుడు వస్తుంది! అని ఊరిస్తున్నారే తప్పా.. అది వచ్చింది లేదు.. మనం చూసింది లేదు.. అంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే చాలా రోజుల నుండి బాలకృష్ణ (Balakrishna) తనయుడి ఎంట్రీ ఈ ఏడాది ఉండబోతుంది.. వచ్చే ఏడాది ఉండబోతుంది.. అని వార్తలైతే వినిపిస్తున్నాయి. కానీ ఆయన సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది అయితే లేదు.అయితే మోక్షజ్ఞ మొదటి సినిమాకి బోయపాటి శ్రీను (Boyapati sreenu)దర్శకత్వం వహిస్తారని, లేదు వివి వినాయక్ (VV.Vinayak) చేస్తారని, కాదు.. మోక్షజ్ఞ కి తన తండ్రి బాలకృష్ణనే డైరెక్షన్ చేస్తారు అంటూ ఇలా ఎన్నో రూమర్లు వినిపించినప్పటికీ ఏది నిజం కాలేదు. చివరికి బాలకృష్ణ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అయినటువంటి ప్రశాంత్ వర్మ (Prashanth Varma)ని తన కొడుకు ఫస్ట్ సినిమా కోసం డైరెక్టర్ గా ఎంచుకున్నారు. ఇక ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ఉండబోతుంది అని అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు.
మోక్షజ్ఞ మూవీ కోసం హీరోయిన్స్ వేట..
అంతేకాదు ఆ సినిమా కోసం నందమూరి మోక్షజ్ఞ లుక్ ని సైతం రివీల్ చేశారు.కానీ సడన్గా ప్రశాంత్ వర్మ (Prashanth Varma) , మోక్షజ్ఞ (Mokshagna) సినిమా ఆగిపోయింది అని,డైరెక్షన్ చేయను కానీ కథ మాత్రమే ఇస్తాను అని ప్రశాంత్ వర్మ కండిషన్ పెట్టారని,ఈ కండిషన్ కు బాలకృష్ణ ఒప్పుకోక ప్రశాంత్ వర్మను తప్పించినట్టు వార్తలు వినిపించాయి. కానీ అవన్నీ రూమర్లుగానే మిగిలిపోయాయి. ఎందుకంటే ప్రశాంత్ వర్మ సినిమా నుండి తప్పుకోలేదు. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లోనే రాబోతోంది. అయితే డైరెక్టర్ మాత్రమే కాదు హీరోయిన్ విషయంలో కూడా ఎన్నో రూమర్లు తెరమీద వినిపించాయి. మొదట మోక్షజ్ఞ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి(Kriti Shetty), శ్రీలీల వంటి యంగ్ హీరోయిన్ ల పేర్లు వినిపించాయి. అయితే శ్రీలీల (Sreeleela) దాదాపు ఫిక్స్ అయినట్టు కూడా రూమర్లు వచ్చాయి.
మోక్షజ్ఞ సరసన ఆమె కావాలంటున్న నందమూరి ఫ్యాన్స్..
కానీ నందమూరి ఫ్యాన్స్ మాత్రం మాకు శ్రీలీల వద్దు.. ఆ హీరోయిన్ కావాలి అంటూ సోషల్ మీడియా వేదికగా తమ డిమాండ్లను బయట పెడుతున్నారు. మరి ఇంతకీ నందమూరి అభిమానులు మోక్షజ్ఞ సరసన ఏ హీరోయిన్ ని చూడాలి అనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం.. నందమూరి అభిమానులు మోక్షజ్ఞ సరసన మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary)నే హీరోయిన్ గా బాగుంటుంది అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీనాక్షి చౌదరి – మోక్షజ్ఞ (Meenakshi Chowdary- Mokshagna) కాంబో అదుర్స్ అని,వీరిద్దరి కాంబోలో ఫస్ట్ సినిమా వస్తే మోక్షజ్ఞకు ఇక ఇండస్ట్రీలో తిరుగుండదంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇప్పటివరకు మోక్షజ్ఞ కి హీరోయిన్ ఎవరో అఫీషియల్ గా బయట పెట్టకపోయినప్పటికీ శ్రీలీల అని ఇన్సైడ్ వర్గాల నుండి టాక్ వినిపిస్తోంది. కానీ తాజాగా నందమూరి ఫ్యాన్స్ మాత్రం మీనాక్షి చౌదరి కావాలనుకుంటున్నారు. మరి చూడాలి నందమూరి మోక్షజ్ఞ కి జోడిగా ఏ హీరోయిన్ ని తీసుకుంటారో..