BigTV English

Cancer Tissues Identifie : లైట్‌తో చిన్న క్యాన్సర్ టిష్యూలు కూడా గుర్తించవచ్చు..!

Cancer Tissues  Identifie  : లైట్‌తో చిన్న క్యాన్సర్ టిష్యూలు కూడా గుర్తించవచ్చు..!
Cancer Tissues  Identifie


Cancer Tissues Identifie : క్యాన్సర్ టిష్యూను ముందుగా కనిపెట్టి, అది శరీరం మొత్తం వ్యాప్తి చెందకుండా పలు నివారణ చర్యలను శాస్త్రవేత్తలు ఇప్పటికే కనిపెట్టారు. ఒకప్పుడు క్యాన్సర్ వచ్చిందంటే మరణం తప్పదు అనుకునేవారికి వారు కొత్త ఆశను కల్పించారు. అయినా కూడా శాస్త్రవేత్తలు ఇంకా దీనిపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా 12వ తరగతి చదివే కుర్రాడు అందరూ ఆశ్చర్యపోయే విధంగా క్యాన్సర్‌కు కొత్త చికిత్సను కనిపెట్టి చూపించాడు.

కెనడాకు చెందిన 12వ తరగతి చదివే ఆర్యన్ హర్షిత్‌.. ఒక్కసారి ఆ దేశంలో హాట్ టాపిక్‌గా మారిపోయాడు. దానికి కారణం ఇంత చిన్న వయసులో అతడు చేసిన అదిపెద్ద ప్రయోగమే. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ సాయంతో క్యాన్సర్‌ టిష్యూను కనిపెట్టడానికి పలు పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. కానీ అవేవి అవసరం లేకుండా ఒక్క లైట్‌తో క్యాన్సర్ టిష్యూకు, మిగతా టిష్యూలకు తేడా కనిపెట్టవచ్చని ఆర్యన్ కనిపెట్టాడు. దీనిపై అతడు చేసిన పరిశోధనలకు కెనడా సైన్స్ ఫెయిర్‌లో అతడికి వెండి పతాకం కూడా దక్కింది.


ఆర్యన్ కనిపెట్టిన ‘లైట్ఆర్’ అనే టెక్నాలజీ క్యాన్సర్ కనిపెట్టే విషయంలో కొత్త సంచలనంగా మారనుంది. ప్రస్తుతం క్యాన్సర్ బారిన పడిన వారిని కాపాడడానికి సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. ఆ సర్జరీలు సక్సెస్ అయ్యి, పేషెంట్లు క్యాన్సర్ బారినుండి బయటపడిన తర్వాత కూడా మళ్లీ కొంతకాలం తర్వాత క్యాన్సర్ వారి ఒంటిలో వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దీనికి కారణం ఆ సర్జరీలు క్యాన్సర్‌కు సంబంధించిన చిన్న చిన్న టిష్యూలను కనిపెట్టి, వైద్యులు వాటిని తొలగించకపోవడమే. అందుకే లైట్ఆర్ అనేది చిన్న క్యాన్సర్ టిష్యూలను కూడా కనిపెడుతుందని నిపుణులు చెప్తున్నారు.

పాథలజీ ల్యాబ్స్ అనేది పేషెంట్ శరీరంలో మిగిలిపోయిన టిష్యూల గురించి వైద్యులు స్టడీ చేయగలుగుతున్నారు. అంటే మైక్రోస్కోప్ ద్వారా వాటి ఈ టిష్యూలను కనిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ పరీక్షలు చాలా సమయాన్ని తీసుకుంటాయి. ఒక్కొక్కసారి వారాలు గడిచినా కూడా ఈ పరీక్షల వల్ల సరైన రిజల్ట్స్ అనేవి రావు. అది పేషెంట్ల ప్రాణాలకు ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పటినుండి ఈ లైట్ఆర్ టెక్నాలజీ ద్వారా చిన్న క్యాన్సర్ టిష్యూలను కూడా కనిపెట్టి.. వైద్యులు వాటిని తొలగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆర్యన్‌ను ప్రశంసిస్తున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×