E-Paper
Advertisement

Hansika Latest News : బాలీవుడ్ డిజైనర్స్ హేళన చేసేవారు

Hansika Latest News  : బాలీవుడ్ డిజైనర్స్ హేళన చేసేవారు
Advertisement

Hansika Latest News : చైల్డ్ ఆర్టిస్టులుగా తమ కెరీర్‌ను ప్రారంభించి.. ఆ తర్వాత హీరోలుగా, హీరోయిన్లుగా సక్సెస్ అయినవారు ఎంతోమంది ఉన్నారు. వారిలో హన్సిక కూడా ఒకరు. చైల్డ్ ఆర్టిస్టుగా పలు హిందీ సినిమాల్లో నటించిన హన్సిక.. హీరోయిన్‌గా ప్రేక్షకులను మొదటిగా పలకరించింది మాత్రం తెలుగు సినిమాతోనే. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేశముదురు’ చిత్రంతో తను హీరోయిన్‌గా మారింది. ఇక హీరోయిన్‌గా మారిన తర్వాత తను ఎదుర్కున్న అనుభవాల గురించి బయటపెట్టింది హన్సిక.

Advertisement

హన్సిక కేవలం బ్యూటిఫుల్ మాత్రమే కాదు.. బోల్డ్ కూడా. అందుకే తనకు ఏది నచ్చకపోయినా వెంటనే చెప్పేస్తుంది. ఈ నేచర్ కారణంగా తను ఎన్నో కాంట్రవర్సీలలో కూడా చిక్కుకుంది. తాజాగా తన కెరీర్ మొదట్లో ఎదుర్కున్న అనుభవాల గురించి పలు సందర్భాల్లో బయటపెడుతూ వస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే ఒక స్టార్ హీరో కెరీర్ మొదట్లో తనను బాగా ఇబ్బంది పెట్టాడని బయటపెట్టిన హన్సిక.. తాజాగా బాలీవుడ్ డిజైనర్స్ కూడా తనను హేళన చేసేవారని చెప్పుకొచ్చింది. కొందరు బాలీవుడ్ డిజైనర్స్ తనకు స్టైలింగ్ చేయనని చెప్పేవారని అంటోంది.

చైల్డ్ ఆర్టిస్టు నుండి హన్సికను హీరోయిన్‌గా మార్చాలనే ఐడియా ఏ బాలీవుడ్ డైరెక్టర్‌కు రాలేదు. కానీ తనను చూసిన వెంటనే దేశముదురుతో హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చాడు పూరీ జగన్నాధ్. ఆ తర్వాత కూడా తెలుగులోనే హీరోయిన్‌గా బీజీ అయిపోయింది. దీంతో బాలీవుడ్‌లో తనను అందరూ ఒక సౌత్ హీరోయిన్‌గానే చూసేవారట. అందుకే డిజైనర్లను దుస్తుల కోసం సంప్రదించినప్పుడు ‘సౌత్ యాక్టర్.. నీకు డిజైనింగ్ చేయడం కుదరదు’ అని చెప్పి హేళన చేసేవారని అంటోంది హన్సిక.

Advertisement

కెరీర్ ప్రారంభంలో అలా ఇబ్బందులు పడినా కూడా గత కొన్నేళ్లలో పరిస్థితులలో చాలా మార్పులు వచ్చాయని హన్సిక చెప్తోంది. సౌత్ ఇండస్ట్రీ అంటే బాలీవుడ్‌లో కూడా మంచి గుర్తింపు లభించిందని అంటోంది. ఒకప్పుడు తమ దుస్తులు ఇవ్వడానికి రిజెక్ట్ చేసిన డిజైనర్స్.. ఇప్పుడు స్వయంగా తన దగ్గరకు వచ్చి వారి దుస్తులను ప్రమోట్ చేసుకుంటున్నారని గర్వపడుతోంది. అప్పుడు వారు తనను హేళన చేసినా కూడా అదేమీ గుర్తుపెట్టుకోకుండా తను కూడా వారికి సపోర్ట్ చేస్తుందని చెప్పింది. తనను తాను ఇండియన్ సినిమాలో నటిస్తున్న నటిగానే భావిస్తానని తెలిపింది హన్సిక.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×