BigTV English

Vehicle Headlights:హెడ్‌లైట్స్ వల్ల కళ్లకు ప్రమాదమా..? నిపుణుల రిపోర్ట్..

Vehicle Headlights:హెడ్‌లైట్స్ వల్ల కళ్లకు ప్రమాదమా..? నిపుణుల రిపోర్ట్..

Vehicle Headlights:ఒకప్పుడు కార్లకు ఉండే హెడ్‌లైట్లు ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా కేవలం దారిని చూపించడానికి మాత్రమే ఉపయోగపడేవి. కానీ ఇప్పుడు హెడ్‌లైట్స్‌లో చాలా మార్పులు వచ్చాయి. మునుపటి లాగా కాకుండా ఇప్పుడు ఇవి చాలా ప్రకాశవంతంగా మారడమే కాకుండా ఎదురుగా వచ్చే వాహనాలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఆ బ్రైట్‌నెస్‌కు కారణమేంటో నిపుణులు తాజాగా బయపెట్టారు.


ఒకప్పుడు వాహనాల హెడ్‌లైట్స్‌ను హాలోజెన్ అండ్ హై ఇంటెన్సిటీ డిశ్చార్జ్ (హైచ్‌ఐడీ) లైట్లతో తయారు చేసేవారు. కానీ ఇప్పుడు వాటి స్థానంలోకి ఎల్ఈడీ (లైట్ ఎమిట్టింగ్ డియోడ్) హెడ్‌లైట్లను ఉపయోగించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం మనం చూస్తున్న హెడ్‌లైట్లలో మార్పుకు కారణం ఈ ఎల్‌ఈడీ లైట్లే. ఇప్పటికే నేషనల్ హైవే ట్రాఫిక్ అడ్మినిస్ట్రేషన్.. ఈ హెడ్‌లైట్లు ఉన్న వాహనాలపై చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఉంది. ఎందుకంటే ఈ హెడ్‌లైట్ల వల్ల అవతలవైపు నుండి వాహనాలకు దారి కనిపించడం ఇబ్బందిగా మారుతుంది.

ఆటోమొబైల్స్ రంగంలోని పలువురు నిపుణులు కూడా ఈ హెడ్‌లైట్లపై పరిశోధనలు చేశారు. ఇవి మోతాదు కంటే ఎక్కువ ప్రకాశవంతంగా మారాయని వారు కూడా రిపోర్టులో తేల్చారు. కాకపోతే ఈ కొత్త హెడ్‌లైట్ల వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయని వారు తెలిపారు. ఇవి ఎక్కువకాలం పాటు పనిచేస్తాయని, మరింత మెరుగ్గా ఉంటాయని, అంతే కాకుండా ఇవి చూడడానికి కూడా కొత్తగా ఉంటాయని వారు అన్నారు. ముందుగా లగ్జరీ వాహనాలకు మాత్రమే ఏర్పాటు చేసిన ఈ ఎల్ఈడీ హెడ్‌లైట్లు.. ఇప్పుడు ఇతర వాహనాలకు కూడా వచ్చేశాయి.


ఎల్ఈడీ హెడ్‌లైట్లలో వల్ల మనుషుల కళ్లకు ఎఫెక్ట్ అవుతుందని కూడా నిపుణులు చెప్తున్నారు. ఇవి మామూలు హాలోజెన్ లైట్ల కంటే 40 శాతం ఎక్కువ బ్రైట్‌గా ఉంటాయని వారు తెలిపారు. అయితే హాలోజెన్ లైట్లు అంత మెరుగ్గా లేవని, అందుకే వాటి స్థానంలో ఎల్ఈడీ లైట్లను పెట్టామని పలు కార్ల కంపెనీలు చెప్తున్నాయి. ఈ ఎల్ఈడీ హెడ్‌లైట్లను అమర్చే ముందు అన్ని కరెక్ట్‌గానే చెక్ చేస్తున్నామని, వాటి వల్ల కళ్లకు హాని కలిగించేంత వెలుగు వెలువడడం లేదని కంపెనీలు.. తమపై వస్తున్న అభియోగాలను ఖండిస్తున్నాయి.

Indian R&D:వెనకబడుతున్న ఇండియా ఆర్&డీ..

Water Purifier:తక్కువ ఖర్చుతో తాగునీటితో పాటు కరెంటు..

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×