Latest UpdatesScience & Technology

Solar Panels : సోలార్ ప్యానెల్స్ వల్ల పర్యావరణానికి విపత్తు.. నిపుణులు హెచ్చరిక..

Solar Panels

Solar Panels : ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ జానాభా అనేది పెరిగిపోతోంది. దానికి తగినట్టుగా మనుషుల అవసరాలు కూడా పెరిగిపోతున్నాయి. కరెంటు, నీరు లాంటి నిత్యావసరాలు ఎక్కువగా వినియోగిస్తే.. భవిష్యత్తు తరాలకు అందనంత రీతిలో వాటి వినియోగం పెరిగిపోయింది. అందుకే శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు వీటికి ప్రత్యామ్నాయాన్ని కనిపెడుతున్నారు. కరెంటుకు ప్రత్యామ్నాయంగా సోలార్ ప్యానెల్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి. కానీ వీటి గురించి పలు షాకింగ్ విషయాలు బయటపెట్టారు శాస్త్రవేత్తలు.

సోలార్ ప్యానెల్స్‌ను కరెంటుకు ప్రత్యామ్నాయంగా మారుతున్నాయని మానవాళి అంతా సంతోషపడుతుంది. వీటి వల్ల గాలిలో కార్బన్ లాంటి హానికరమైన గ్యాసుల విడుదల కూడా తగ్గిపోతుందని పర్యావరణవేత్తలు సైతం సంతోషిస్తున్నారు. కానీ అనూహ్యంగా వీటి జీవితకాలం 25 ఏళ్లే అని తాజాగా బయటపడింది. 25 ఏళ్ల తర్వాత సోలార్ ప్యానెల్స్‌ను మార్చాలి లేదా వాటిని ధ్వంసం చేయాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సోలార్ కరెంటు అనేది ఒక టెర్రావాట్ విద్యుత్తును మానవాళికి అందజేస్తోంది.

మామూలు సోలార్ ప్యానెల్స్ అనేవి 400 వాట్స్ కరెంటును ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం దాదాపు 2.5 సోలార్ ప్యానెల్స్ అనేవి ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం ప్రకారం యూకే వ్యాప్తంగా మిలియన్ల సోలార్ ప్యానెల్స్ ఇన్‌స్టాల్ చేయబడి ఉన్నాయి. అయితే ఇవన్నీ 25 ఏళ్ల తర్వాత కచ్చితంగా ధ్వంసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఒక పెద్ద వాతావరణ విపత్తుకు యూకే సిద్ధంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాదాపు 2050 లోపు ఇలాంటివి జరిగే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు.

2050లోపు ఇప్పుడు ఇన్‌స్టాల్ చేసిన సోలార్ ప్యానెల్స్ అన్నీ దాదాపుగా పనిచేయకుండా పోతాయి. అప్పుడు అవి అనవసరమైన భారంగా మారిపోతాయి. ఇప్పటినుండి రీసైక్లింగ్ గురించి ప్లాన్ చేస్తే తప్పా.. ఈ సోలార్ ప్యానెల్స్ అనేవి మళ్లీ ఉపయోగకరంగా మారవని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పటికీ ఈ విషయం తెలియకుండా చాలా సోలార్ ప్యానెల్స్ తయారీ జరుగుతూనే ఉంది. కానీ ఇవన్నీ వేస్ట్‌గా మారిన తర్వాత జరిగే నష్టాన్ని ఎవరూ ఊహించడం లేదని గుర్తుచేస్తున్నారు. అందుకే రీసైకిల్ చేసే సోలార్ ప్యానెల్స్ తయారీ ఒక్కటే దీనికి పరిష్కారం అని సూచిస్తున్నారు.

ఇప్పటికే పలు దేశాలు, పలు సంస్థలు.. రీకైసిల్ సోలార్ ప్యానెల్స్‌ను తయారు చేస్తున్నాయి. కానీ ఇవన్నీ పూర్తిస్థాయిలో తయారు కావడానికి చాలా సమయం పడుతుంది. అప్పటికే ఇప్పుడు ఇన్‌స్టాల్ చేసిన సోలార్ ప్యానెల్స్ అనేవి పాడయిపోతాయి. అందుకే ముందుగా పర్యావరణానికి ఏ హాని జరగకుండా ఈ సోలార్ ప్యానెల్స్‌ను ధ్వంసం చేసే మార్గాన్ని కనుక్కునే విషయంలో శాస్త్రవేత్తలు నిమగ్నమయి ఉన్నారు. ప్రస్తుతం ఎవరు సోలార్ ప్యానెల్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని అనుకున్నా.. రీసైకిల్ ప్యానెల్స్‌నే ఎంచుకోవాలని సలహా ఇస్తున్నారు.

Related posts

Karnataka Gang Rape : కర్నాటకలో గ్యాంగ్ రేప్..ర్యాపిడో బుక్ చేసుకుంటే..

BigTv Desk

Kazipet Station: భారీ వరద.. రైల్వే స్టేషన్ మునక..

Bigtv Digital

Malnutrition : మహిళల్లో పోషకాహార లోపం కనిపెట్టే టూల్..

Bigtv Digital

Leave a Comment