E-Paper
Advertisement

స్కూటీలో రూ.5 లక్షలు వదిలి.. ఉల్లిపాయలు చౌకగా వస్తాయని వెళ్లాడు, కట్ చేస్తే..

స్కూటీలో రూ.5 లక్షలు వదిలి.. ఉల్లిపాయలు చౌకగా వస్తాయని వెళ్లాడు, కట్ చేస్తే..
Advertisement

జీవితంలో ఒక్క క్షణం వహించే నిర్లక్ష్యం ఎంతటి ఘోరానికి దారితీస్తుందో చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. కష్టపడి సంపాదించిన సొమ్ము లేదా అవసరానికి తెచ్చుకున్న అప్పు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఉదంతం కళ్లకు కడుతోంది. కేవలం ఉల్లిపాయలు కొనడానికి వెచ్చించిన ఆ రెండు నిమిషాల సమయం ఒక రైతు జీవితంలో తీరని శోకాన్ని మిగిల్చింది.

పల్నాడు జిల్లా జొన్నలగడ్డ బైపాస్ సమీపంలో వెంకట సత్యనారాయణ అనే రైతు తన ఆర్థిక అవసరాల నిమిత్తం రూ. 5 లక్షల నగదును అప్పుగా తీసుకున్నాడు. ఆ భారీ మొత్తాన్ని తన స్కూటీ డిక్కీలో భద్రపరిచాడు. ఇంటికి వెళ్లే క్రమంలో రోడ్డు పక్కన ఉన్న దుకాణం వద్ద ఉల్లిపాయలు కొనాలని అనుకున్నాడు. వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి లోపలికి వెళ్లాడు. అయితే ఇక్కడే ఆయన పెద్ద పొరపాటు చేశాడు. నగదు ఉన్న డిక్కీకి సరిగ్గా లాక్ వేయకుండానే అలాగే వదిలేసి వెళ్లాడు.

Advertisement

సెకన్లలోనే డబ్బు మాయం..

సత్యనారాయణ ఉల్లిపాయల బేరంలో ఉండగానే అప్పటికే అతడిని గమనిస్తున్న గుర్తుతెలియని దుండగుడు అదను చూసి రంగంలోకి దిగాడు. స్కూటీ వద్దకు చేరుకుని డిక్కీని సునాయాసంగా తెరిచాడు. అందులో ఉన్న రూ. 5 లక్షల బ్యాగును తీసుకుని క్షణాల్లో అక్కడి నుండి పరారయ్యాడు. తిరిగి వచ్చిన రైతు డిక్కీ తెరిచి చూడగా ఖాళీగా ఉండటంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అప్పుగా తెచ్చుకున్న సొమ్ము కళ్లముందే మాయం కావడంతో బాధితుడు కన్నీరుమున్నీరయ్యాడు.

Advertisement

ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో స్పష్టంగా నమోదయ్యాయి. ఓ యువకుడు చాలా చాకచక్యంగా దొంగతనానికి పాల్పడటం వీడియోలో కనిపిస్తోంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

నెటిజన్ల కామెంట్స్..

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. రైతు పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నప్పటికీ అతని నిర్లక్ష్యాన్ని తప్పుబడుతున్నారు. ‘స్కూటీ డిక్కీలో ఐదు లక్షలు పెట్టుకుని లాక్ వేయకుండా వెళ్లడం మూర్ఖత్వం’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘నిర్లక్ష్యం ప్రాణాల మీదకే కాదు ఆస్తుల మీదకు కూడా వస్తుంది’ అని మరొకరు పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన అందరికీ హెచ్చరికగా నిలుస్తోంది.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×