Gundeninda GudiGantalu Today episode August 29th : ఇంటినీ అమ్మాల్సిన అవసరం మాకు లేదు.. తాకట్టు పెట్టాలన్న ఆలోచన మాకు లేదు అని బాలు అంటాడు.. మరి పాలు ఎలా డబ్బులని కడతారు అని అందరూ అనుకుంటారు. అప్పుడే సత్యం ఎలారా డబ్బులు ఏం చేసి కడతావు. నేను నాకు తెలిసిన వాళ్ళని అడిగి చూస్తాను అని సత్యం అంటాడు.. కానీ బాలు మాత్రం నానమ్మ పొలం ఉంది కదా దాన్ని తాకట్టు పెట్టి, డబ్బులు తీసుకొని ఈ ఆర్డర్ పూర్తి చేసిన తర్వాత మళ్లీ డబ్బులు సంపాదించి తాకట్టులో ఉన్న పొలాన్ని విడిపిస్తాము అని చెప్తారు.. కానీ ప్రభావతి మనోజ్ మాత్రం ఆ పొలం గురించి పెద్ద రచ్చ చేస్తారు. కానీ మనోజ్ కి బాలు ఒక్కొక్కటి బయట పెడుతూ కౌంటర్లు ఇవ్వడంతో నోరు మూసుకుంటాడు.. అటు మీనా వంట చేస్తూ ఉండగా ప్రభావతి అక్కడికి వెళుతుంది ఆ పొలం తాకట్టు పెట్టడానికి అసలు వీల్లేదు అంటూ మీనా కి దిమ్మ తిరిగిపోయిన షాక్ ఇస్తుంది.. మీనా కూడా ప్రభావతి మాటకి కౌంటర్లు వేస్తూ ఉంటుంది.
మీనా వంట చేస్తూ ఉండగా అక్కడికి వెళ్లిన ప్రభావతి నువ్వు పొలం అమ్మాలని చూస్తున్నావా వాడిని రెచ్చగొడుతున్నావా అని అడుగుతుంది. ఇప్పుడు నువ్వు పొలం అమ్మి ఆ డెకరేషన్ తీసుకుంటూ ఉంటే మేము చూస్తూ ఊరుకుంటానా? అని ప్రభావతి అనగానే ఏం చేస్తారు ఏమైనా చేసుకోండి అని మీనా అంటుంది. ఇప్పటివరకు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుందాం అనుకున్నాము మీరు చెప్పిన తర్వాత అమ్మాలని మాకు అనిపిస్తుంది అమ్మమ్మకి ఫోన్ చేస్తే వెంటనే అమ్మే అని చెప్తుంది చేయమంటారా అని నేను అడుగుతుంది. ఇక మీనా ప్రభావతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా శృతి అక్కడికి వస్తుంది. కరెక్ట్ గా చెప్పావు మీనా? ఆంటీకి ఇప్పుడు దిమ్మ తిరిగిపోయి ఉంటుంది కదా అని శృతి మీనాకి సపోర్టుగా మాట్లాడడంతో ప్రభావతి సీరియస్ గా బయటికి వస్తుంది.. అది చూసిన బాలు ఏంటి మా అమ్మవతికి కోపం వచ్చింది అని అంటాడు..
ఏంటమ్మా అది అంత కోపంగా ఎక్కడికి వెళ్తున్నావు అని బాలు కావాలని అడుగుతాడు. అయితే ప్రభావతి మాత్రం నీ పెళ్ళాం కి నోరెక్కువయింది పోయి నీ పెళ్ళాన్ని ఆడుకోపో అనేసి అంటుంది. ఇక లోపలికి వెళ్ళగానే ఏంటి మీనా మా అమ్మ ఎందుకు అంత సీరియస్ గా వెళ్తుంది ఏమైనా చేశారా అని అడుగుతాడు. నేనేం చేశాను పొలం తాకట్టు పెడదాం.. అన్నందుకే మీ అమ్మగారు ఇంతగా రెచ్చిపోతున్నారు అని మీనా అనగానే శృతి కూడా మేన అన్నదంట తప్పేమీ లేదు బాలు అందుకే ఆంటీ కోపంగా వెళ్ళిపోయారు అని అంటుంది.. ఇన్ని రోజులకి నువ్వు మా అమ్మని ఎదిరించావా అని మీనా ని ఎత్తుకొని తెగ పోగిడేస్తూ ఉంటాడు బాలు. ఇక శృతి పల్లీలు తినడం చూసిన బాలు ఎవరు పల్లీలు తింటున్న కూడా ఆ పార్కులో పడుకునే మనోజ్ గాడే తిన్నట్టు ఉంటుంది అని అనగానే శృతి సీరియస్ అవుతుంది. ఆ డబ్బులు గురించి ఇప్పుడు ఏం చేద్దాం అండి అని నేను అడగగానే అప్పు తీసుకోవడం బెటర్ ఏమో అని అనుకుంటారు.
కామాక్షి ఇంటికి వెళ్ళిన ప్రభావతి చాలా కోపంగా ఉండడం చూసిన కామాక్షి పాయసం తీసుకుని వచ్చి తిను వదిన అని అంటుంది.. నాకు ఏమీ వద్దు అని అనే లోపల చింతామణి లోపలికి రావడం చూసి కామాక్షి వచ్చింది ఇంకా ఏదో ఒక పుల్ల పెడుతుంది అని అనుకుంటుంది. ప్రభావతి ఆ మీనా డబ్బులు లేవని ఇంటిని తాకట్టు పెడతాను అని అంది కానీ నేను ఒప్పుకోలేదు. ఇప్పుడు మా అత్తయ్య గారి ఆస్తిని తాకట్టు పెట్టి డబ్బులు కట్టాలని అనుకుంటుంది అని అంటుంది. మరైతే మీనా ఇప్పుడు ఆ డబ్బులు కట్టలేదు కదా.. ఆ ఆర్డర్ నుంచి తప్పుకుంటున్న అని తను అడుగుతుంది అయితే కామాక్షి ఇద్దరికీ కలిపి క్లాస్ పీకుతుంది.. మీనా ఎప్పటికైనా అనుకున్నది సాధించి తీరుతుంది అని ప్రభావతి చింతామణిలకు కామాక్షి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.
రాఖీ పండుగ కాబట్టి మౌనిక వస్తే తనకి మంచి చీర పెట్టాలి అని పాలు తనకోసం ఒక మంచి చీరని తీసుకొని వస్తాడు. ఆ చీరని చూసిన మీనా చాలా బాగుందండి మీరు ఎంత మంచి వాళ్ళు అంటూ పొగిడేస్తూ ఉంటుంది. కానీ ఆ చీర తీసుకుని వచ్చింది మౌనిక కోసమని చెప్పగానే ఓ రాఖీ పండుగ కోసం అని మౌనికకు కొత్త చీర తీసుకొని వచ్చారా నిజంగానే చాలా బాగుంది అని మీనా అంటుంది. మరి ఆ చీర గురించి మాట్లాడిన తర్వాత మీనా మౌనిక కి కాల్ చేశారా తనని రమ్మని చెప్పారా అని అడుగుతుంది. నేను ఇంకా ఫోన్ చేయలేదు అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలియదు కదా అని బాధ పడిపోతూ ఉంటాడు.
మౌనిక సంజు లేడని తెలుసుకొని రాఖీలను కొనుక్కొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటుంది. ఇది ఏదో తాస్తుంది దాని గురించి తెలుసుకోవాలి అని సంచు కూడా మౌనికని పిలుస్తాడు. కానీ మౌనిక మాత్రం ఏమీ లేదండి అని ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తుంది సంజు మంచింగ్ లోకి జీడిపప్పులు వేయించుకొని రా అని చెప్పి వంట గదిలోకి పంపిస్తాడు. మౌనిక దాచిన వస్తువు ఏంటో తెలుసుకోవాలని రూమ్ కి వెళ్లి అక్కడ చెక్ చేయగానే అందులో రాఖీలు బయటపడతాయి. మీ అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్లి నువ్వు రాఖీ కట్టాలని అనుకుంటున్నావా అసలు చాన్స్ లేదు అంటూ వాటిని డస్ట్ బిన్ లో పడేస్తాడు అది చూస్తున్న మౌనిక కన్నీళ్లు పెట్టుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో సంజుకు తెలియకుండా మౌనిక తన అన్నలకి రాఖీ కడుతుందా లేదా అన్నది చూడాలి..
Also Read :Intinti Ramayanam Today Episode: అక్షయ్ కు అవని దూరం.. పల్లవి దొరికిపోయింది.. పార్వతికి అనుమానం..