E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 
Advertisement

Brahmamudi serial today Episode: రేఖ దగ్గరకు వెళ్లి తమ అమ్మ గురించి అడిగిన లక్కీకి రాజు వెళ్లి తప్పకుండా రేఖ పిన్ని నీ సమస్యకు సొల్యూషన్‌ ఇస్తుందని చెప్పి బాదపడొద్దని చెప్పగానే.. లక్కీ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రాజు నీకు ఇంక రెండు రోజులే ఉన్నాయి పిన్ని.. నీ గురించి ఆలోచించే నేను మౌనంగా ఉండిపోయాను. నేను చెబితే నీ కుటుంబంలో సమస్యలు వస్తాయి కదా అందుకే నేను చెప్పలేకపోతున్నాను. నీ సమస్యను నువ్వే పరిష్కరించుకో లక్కీని అందరి ముందు నీ కొడుకుగా ఎలా ఒప్పుకుంటావో అది నువ్వే ప్లాన్‌ చేసుకో ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో పిన్ని నేను చెప్తే నీ లైఫ్‌ లో చాలా డ్యామేజ్‌ జరుగుతుంది. నీ భర్త నీ కొడుకు నిన్ను వదిలేయోచ్చు అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు అంటూ వెళ్లిపోతాడు.

వెంకీ, నందు రెస్టారెంట్‌లో కలుసుకుంటారు. నందు హ్యాపీగా చెప్పరా ఎందుకు మళ్లీ రమ్మన్నావు… నన్ను కలిస్తేనే టైం వేస్ట్‌ అవుతుంది అన్నావు.. మళ్లీ ఎందుకు ఫోన్‌ చేశావు అని అడగ్గానే.. వెంకీ సారీ నందు అప్పుడు నాకు మూడ్‌ బాగాలేదు.. అందుకే అలా మాట్లాడాను.. అంటూ చెప్పగానే.. అంటే నీకే ఎప్పుడు మూడ్‌ ఎలా ఉంటే అలా ఉంటావా..? అని నందు అడగ్గానే.. సారీ నందు నీకన్నా నన్ను ఎవరు బాగా అర్థం చేసుకుంటారు చెప్పు.. అనగానే.. నందు మనసులో నిజమే వీడు ఎందుకో అలా మాట్లాడి ఉంటాడు అనుకుంటుంది. ఇంతలో వెంకీ ఒక అమ్మాయి ఫోటో చూపించి ఇంట్లో వాళ్లు ఈ అమ్మాయిని నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు అని చెప్పగానే..

Advertisement

నందు డిస్సపాయింట్‌ అవుతుంది. బాధపడుతూ.. నువ్వు ఇప్పుడు ఎవ్వరిని ప్రేమించడం లేదా..? నీ మనసులో ఏ అమ్మాయి లేదా..? అని అడగ్గానే.. వెంకీ లేదు నా మనసులో ఇంకెవ్వరూ లేరు.. ఉంటే నీకు చెప్పేవాడిని కదా..? నాకు ఎవరు అయితే బాగుంటారో నీకు తెలిసినంతగా నాకు తెలియదు అందుకే అడుగుతున్నాను… నాకు ఈ అమ్మాయి సరిపోతుందా..? అంటూ వెంకీ అడగ్గానే.. నందు ఇంకా బాధపడుతుంటే.. నీ భార్య స్థానంలోకి నేను రావాలనుకుంటున్నాను.. కానీ నేనే వేరే అమ్మాయిని సెలెక్ట్‌ చేయమంటే ఎలా అని మనసులో బాధపడుతూ.. ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

రాజు స్వీట్స్‌ తీసుకొచ్చి అందరికీ ఇస్తూ డాన్స్‌ చేస్తుంటాడు. భ్రమరాంబ వచ్చి ఏయ్‌ శేషు ఎందుకు ఇప్పుడు ఇంత ఆనందం అని అడుగుతుంది. శేషు తనకేం తెలియదని రాజు డాన్స్‌ చేస్తుంటే తాను చేస్తున్నానని చెప్తాడు. భ్రమరాంబ కోపంగా దీన్నే అంటారు ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి అనగానే.. రాజు వెళ్లి ఊళ్లో పెళ్లి కాదు అత్త మన పెళ్లే అంటూ మళ్లీ సాంగ్‌ పెట్టుకుని డాన్స్‌ చేస్తుంటాడు. అపర్ణ ఇంతకీ గుడ్‌న్యూస్‌ ఏంటి బాబు అని అడుగుతుంది. రాజు ఉండు నాన్నమ్మ చూపిస్తాను అంటూ వెళ్లి టీపాయ్‌ మీద పెట్టిన డబ్బుల కట్టలు చూపిస్తాడు. అవి చూసి అందరూ ఆశ్చర్యపోతారు. రేఖ ఈ డబ్బులు ఎక్కడివి అని అడగ్గానే.. తాను ఇందు కలిసి చేసిన మొదటి ప్రాజెక్టులో వచ్చిన లాభాలు అమ్మమ్మ ఇన్ని సంవత్సరాల తర్వాత మన కంపెనీ మళ్లీ లాభాలు చూసింది అని చెప్తూ.. ఇందు పై నుంచి వస్తుంటే ఎదురుగా వెళ్లి ఎత్తుకుని తిప్పుతాడు.

Advertisement

దీనికంతటికి కారణం నీ మనవరాలే అమ్మమ్మ అంటూ రాజు చెప్పగానే.. అదేం లేదు నీ సహాయం లేకపోతే నేనేం చేయలేను అంటుంది. ఇక వచ్చిన లాభాల నుంచి ఇందు అవసరాల కోసం అందులో డబ్బు తీసుకుంటుంటే.. భ్రమరాంబ బాధపడుతుంది. శేషు మాత్రం వెటకారంగా భూషణ్‌, రేఖలను తిడతాడు. ఇందు ఏవేవో కారణాలు చెప్పి వచ్చిన లాభాల డబ్బు మొత్తం తీసుకుంటుంది. కొంత డబ్బు సుభాష్‌ ఆపరేషన్‌ కోసం తీసుకుంటే అందరూ షాక్‌ అవుతారు. ఇంత సడెన్‌గా ఆపరేషన్ అంటారేంటి అని భ్రమరాంబ అడుగుతుంది. నువ్వు కావాలని ఇందును సీఈవోను చేస్తే నీకు చెప్పకుండా ఇందు ఏం చేస్తుందో చూడు అంటూ రేఖకు చెప్తుంది. రేఖ కోపంగా వదిన నువ్వు కాస్త సైలెంట్‌గా ఉంటావా..? అంటుంది. ఇంతలో ఈరోజు బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 28th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్, జ్యోత్స్నలను కెపేలో చూసిన దక్షిణమూర్తి        

ట్రోలర్స్ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి..చిరు శ్రీకాంత్ సినిమా నాని పై అప్డేట్!

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

కొడుకు బతకాలంటే రూ. 26 కోట్లు కావాలి.. దాతలు ముందడుగు వేస్తే, కాటేసిన సైబర్ రాక్షసులు!

Intinti Ramayanam Today Episode: బాబు కిడ్నాప్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. అవని ప్లాన్ సూపర్..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమను ఇరికించిన భద్ర.. వల్లికి దిమ్మతిరిగే షాక్.. ఇది కదా ఫ్యాన్స్ కోరుకొనేది..

Karthika Deepam 2 Serial Today Episode September 18th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: శివనారాయణను దొంగగా బావించిన ఆలయ ధర్మకర్త          

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. ఇదేం ట్విస్ట్ రా అయ్యా..

Big Stories

Advertisement
×