E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        
Advertisement

Karthika Deepam 2 serial today Episode:   జ్యోత్స్న పెళ్లికి మాలిని, దక్షిణమూర్తి రెడీ అవుతారు. దక్షిణమూర్తిని పెళ్లికి రావొద్దని అక్కడకు వస్తే నీకు ఎవ్వరూ రెస్పెక్ట్ ఇవ్వరని మాలిని చెప్తుంది. అలా అని మనవరాలి పెళ్లి చూడకుండా ఉండలేను కదమ్మా అంటాడు దక్షిణమూర్తి.. మీరు అక్కడకు వస్తే మీ కూతురు ఎదురుగా వచ్చి స్వాగతం చెప్పదు.. మీ అల్లుడు మీకు వెల్కం చెప్పడు కనీసం మిత్రుడు వచ్చాడని శివనారాయణ కూడా మిమ్మల్ని పలకరించరు అంటూ మాలిని బాధపడుతుంది. మీకు అక్కడ ఎవ్వరూ గౌరవం ఇవ్వరు.. అది నేను చూడలేను అందుకే మీరు ఇక్కడే ఉండండి.. వాళ్లందరూ మీ దగ్గరకు వచ్చి సాగిలపడే టైం ఇంకాస్త దగ్గరలోనే ఉంది అంటూ చెప్పగానే.. దక్షిణమూర్తి ఆ రోజు దగ్గరలోనే ఉందన్న ఆనందం ఉందమ్మ కానీ పెళ్లి చూడలేకపోయానన్న బాధ కూడా ఉంటుంది కదమ్మా అంటే.. అంతా మంచే జరుగుతుంది కద మామయ్య గారు మీరు రిలాక్స్‌గా ఉండండి అంటూ చెప్పి వెళ్లిపోతుంది.

పెళ్లి కూతురుగా రెడీ అయిన జ్యోత్స్న దగ్గరకు పెళ్లికోడుకుగా రెడీ అయిన సూరజ్‌ వెళ్లి ఒక గిఫ్ట్‌ ఇస్తాడు. జ్యోత్స్న ఆశ్చర్యపోతుంది. సూరజ్‌ ఏంటి గిఫ్ట్‌ ఇవ్వడం ఏంటి అనుకుని మురిసిపోతుంది. ఇప్పుడే గిఫ్ట్ ఇవ్వడం ఏంటని అడిగితే మనసులో ఇస్తున్నాను.. తీసుకో అని చెప్తాడు.. జ్యోత్స్న తీసుకుని ఓపెన్ చేయబోతే.. ఇప్పుడు వద్దని తర్వాత చూడమని చెప్తాడు సూరజ్‌. అయితే పెళ్లి అయ్యాక నీ పక్కనే కూర్చుని నీతో పాటు నేను చూస్తాను అని చెబితే.. లేదు నువ్వు ఒక్కదానివే కూర్చుని అది చూస్తావు.. అది చూసిన వెంటనే నువ్వు ఆశ్చర్యపోతావు అంటూ సూరజ్‌ చెప్పగానే..

Advertisement

జ్యోత్స్న రొమాంటిక్‌గా చూస్తూ.. తన ప్రేమ గురించి పెళ్లి తర్వాత ఎలా ఉండాలి అనే విషయాలు మొత్తం చెప్తుంది. సూరజ్‌ ను వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేని పరిస్థితికి తన మనసు వెళ్లిపోయిందని చెప్తుంది. మన ప్రేమకు కొన్ని జ్ఞాపకాలు మిగిలిపోవాలి అంటే నేను ఒక పని చేయాలని నిర్ణయించుకున్నాను అంటూ పక్కనే ఉన్న గులాబీ పువ్వు తీసుకుని సూరజ్‌ కళ్లల్లోకి చూస్తూ..  ఐ లవ్‌ యూ అంటూ చెప్తుంది. ఈ నా ప్రపోజల్ నీకు జీవితాంతం గుర్తుండిపోతుంది.  ఇది గులాబి కాదు నా మనసు.. దీన్ని అందుకునే అర్హత నీకు మాత్రమే ఉంది తీసుకో సూరజ్.. నా కంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నా.. ఇక నా కంటూ ఓ జీవితం లేదు.. మనిద్దరిదీ ఒకటే జీవితం అంటూ కవిత్వం చెప్తుంటే.. సూరజ్‌ గులాబీ తీసుకుని సరే ఇక మండపంలో కలుద్దాం నేను నీకు ఇచ్చిన గిఫ్ట్‌ జాగ్రత్త అంటూ వెళ్లిపోతాడు.

ఇక పెళ్లికి మాలిని ఒక్కతే రావడంతో శివనారాయణ మీ మామయ్య రాలేదా..? ఓ కయ్యానికి అయితే ముందుంటాడేమో అంటూ దీపను పిలిచి మాలినిని ముందు వరుసలో కూర్చోబెట్టమని చెప్తాడు. దీప అలాగే తాతయ్యగారు అంటూ మాలినిని తీసుకెళ్లి ముందు వరుసలో కూర్చోబెడుతుంది. మరోవైపు లోపల జ్యోత్స్న మండపానికి వస్తూ.. దాసు దగ్గరకు వెళ్లి ఆశీర్వదించమని అడుగుతుంది. పెళ్లి అయిన తర్వాత నేను అందరికీ నిజం చెప్తాను అంటుంది. పెళ్లి వరకు దశరథ కూతురిలా ఉంటానని.. పెళ్లి అయిన తర్వాత దాసు కూతురిలా బతుకుతానని చెప్తుంది. అందుకు దాసు, పారిజాతం నిజం చెప్పొద్దని అంటారు. అప్పుడే దీప వచ్చి టైం అవుతుంది రమ్మని పిలుస్తుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×