E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: బుజ్జమ్మను ఎత్తుకెళ్లేందుకు అమర్‌ ఇంట్లోకి ఆశ్రమం పిల్లలతో పాటు వెళ్లిన ప్రచండ శిష్యుడు చిన్న పిల్లాడిలా బిహేవ్‌ చేస్తూ.. పిల్లలందరినీ బయట ఆడుకుందామని తీసుకెళ్తాడు. అమర్‌, పార్థు ఏదో పనుందని రూంలోకి వెళ్తారు. మిస్సమ్మ, రాథోడ్‌, సరస్వతి వార్డెన్‌ సీక్రెట్‌గా మాట్లాడుకోవడానికి మేడ మీదకు వెళ్తారు. మనోహరి, చంభా బయట కాబ్రా ఎలా కిడ్నాప్‌ చేస్తాడో చూద్దామని బయటకు వెళ్తారు. కాబ్రా పిల్లలతో ఆడుకుంటూ తనతో పాటు తీసుకొచ్చిన మంత్రదండంతో బుజ్జమ్మను కిడ్నాప్‌ చేయాలని ‌ప్రయత్నిస్తుంటాడు. కానీ ప్రతిసారి ఎవరో ఒకరు అడ్డం వస్తుంటారు. మరోవైపు ప్రచండ పూజలు, హోమాలు చేస్తూ బుజ్జమ్మ కోసం వెయిట్‌ చేస్తుంటాడు.

మేడ మీదకు వెళ్లిన వార్డెన్‌ మిస్సమ్మతో పార్థు చాలా మంచి వాడిలా ఉన్నాడు అలాంటి వ్యక్తికి రాక్షసి లాంటి మనోహరిని ఇచ్చి పెళ్లి చేయడం ఏంటని అడుగుతుంది. పార్థు చూడటానికి అలా కనిపిస్తున్నాడు కానీ తను చాలా కఠినమైన వ్యక్తి అని మంచివాళ్తో మంచిగా చెడ్డ వాళ్లతో చెడ్డగా ఉంటాడని మిస్సమ్మ చెప్తుంది. మనోహరి ముక్కుకు కల్లెం వేసే సరియైన వ్యక్తి పార్థు సార్‌ అని రాథోడ్‌ చెప్తాడు.

Advertisement

కింద ఇంకా కాబ్రా తన పని చేయడం లేదని మనోహరి ఇరిటేట్‌ అవుతుంది. ఇంకెంత సేపు చేస్తాడు చంభా అమర్‌కు నిజం తెలిస్తే అందరం ప్రమాదంలో పడిపోతాం అంటూ భయపడుతుంది. చంభా మాత్రం అలాంటిదేం ఉండదులే మనోహరి.. కాబ్రా తన పని చేసుకుని వెళ్తాడు అని చెప్తుంది. కాబ్రా ఎంత ప్రయత్నించినా ఎవరో ఒకరు అడ్డు రావడంతో మంత్రందండం బుజ్జమ్మ మీద పెట్టలేకపోతుంటాడు. ప్రచండ మాత్రం కాబ్రా బుజ్జమ్మను తీసుకురావడం కోసం పూజలు చేస్తూ వెయిట్‌ చేస్తుంటాడు. చంభా మాత్రం అనుమానంగా ఏంటి మనోహరి ఆ ముగ్గురు చెవులు కొరుక్కుంటూ పైకి వెళ్లారు అనగానే.. మనోహరి కోపంగా  కొరుక్కోని కాసేపట్లో కాబ్రా పని ముగించేస్తాడు.  అప్పుడు వాళ్ల చెవుల్లోంచి కళ్లల్లోంచి రక్తం వస్తుంది అంటూ చూస్తుంది.

వార్డెన్‌ మాత్రం మిస్సమ్మ చేయబోతున్న పనికి అప్రిసియేట్‌ చేస్తుంది. మీకు అంత ద్రోహం చేసిన మనోహరికి పెళ్లి చేయాలనే మంచి మనసు నీకెలా వచ్చిందమ్మా అని అడుగుతుంది. అందుకు మిస్సమ్మ ఎమోషనల్ అవుతూ మనోహరికి పెళ్లి చేయాలనేది మా అక్క కోరిక మేడం.. అలాగే అక్క ఆత్మగా ఉన్నప్పుడు కూడా మనోహరిని ఏమీ చేయలేదు మనిషిగా మార్చాలని చూసింది. అందుకే మనోహరిని మార్చేందుకు పెళ్లి చేస్తే సరిపోతుందని బావించాను అని చెప్తుంది. కానీ మనోహరి వల్ల ఆ అబ్బాయి ఎన్ని కష్టాలు పడతాడో అంతటి రణవీరే మనోహరిని తట్టుకోలేకపోయాడు అని అడిగితే..

Advertisement

మీరేం బాధపడకండి మేడం పార్థు సార్‌ లాంటి వ్యక్తే మనోహరి మెడలు వంచగలడు అని చెప్తాడు రాథోడ్‌. అప్పుడే వార్డెన్‌కు అనుమానం వస్తుంది. తనకు యాదమ్మతో ఫోన్‌ చేయించి ఇంత దూరం వచ్చేలా చేసిందంటే మనోహరి ఏదో ప్లాన్‌ చేసింది వెంటనే నేను పిల్లలను తీసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపోతాను అంటూ వార్డెన్‌ కిందకు వస్తుంది. మిస్సమ్మ, రాథోడ్‌ కూడా కిందకు పిల్లలు ఆడుకుంటున్న గార్డెన్‌ దగ్గరకు వెళ్తారు. మిస్సమ్మ పిల్లలందరినీ పిలిచి ఆగండి అంటుంది. అందరూ ఆగిపోయాక బుజ్జమ్మ నిన్న నీకు అంకుల్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన ఆంజనేయస్వామి ఐడల్‌ తీసుకొచ్చి అందరికీ చూపించు అని చెప్పగానే.. బుజ్జమ్మ అలాగే అమ్మ అంటూ లోపలికి వెళ్తుంది. మనోహరి ఇదొకతి మధ్యలో వచ్చి అంత చెడగొట్టింది అంటూ ఫీల్‌ అవుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

కొడుకు బతకాలంటే రూ. 26 కోట్లు కావాలి.. దాతలు ముందడుగు వేస్తే, కాటేసిన సైబర్ రాక్షసులు!

Intinti Ramayanam Today Episode: బాబు కిడ్నాప్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. అవని ప్లాన్ సూపర్..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమను ఇరికించిన భద్ర.. వల్లికి దిమ్మతిరిగే షాక్.. ఇది కదా ఫ్యాన్స్ కోరుకొనేది..

Karthika Deepam 2 Serial Today Episode September 18th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: శివనారాయణను దొంగగా బావించిన ఆలయ ధర్మకర్త          

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. ఇదేం ట్విస్ట్ రా అయ్యా..

ఆయనో భూస్వామి..నువ్వో పెయింటర్‌.. రా భూముల లెక్కలు తేల్చుకుందాం..! కేటీఆర్‌ వీరావేశం..

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్.. ఐఫోన్ ధరలు తగ్గుతాయా? లేక షాక్ ఇస్తాయా? పూర్తి విశ్లేషణ!

Big Stories

Advertisement
×