E-Paper
Advertisement

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!
Advertisement

Air India Flight: ఢిల్లీ నుంచి విజయవాడ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికులకు కాసేపు తీవ్ర ఆందోళన కలిగించే సంఘటన ఎదురైంది. విమానం గాల్లో ఉండగానే ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారు.

హైదరాబాద్‌ వైపు మళ్లింపు..

Advertisement

విజ‌య‌వాడ‌లో ల్యాండ్ అవ్వాల్సిన స‌మాయానికి ఇంజిన్‌లో స‌మ‌స్య గుర్తించిన పైలట్, ముందస్తు జాగ్రత్తగా విమానాన్ని హైదరాబాద్ వైపు మళ్లించారు. అయితే ప్రయాణంలో ఉండగానే ఆ సాంకేతిక లోపం సరికావడంతో.. పైలట్ మళ్లీ విమానాన్ని విజయవాడ వైపు తిప్పారు. గాల్లో ఏర్పడిన ఈ ఊహించని పరిణామంతో విమానంలో ఉన్న వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

విమానంలో మంత్రి, ప్రజాప్రతినిధులు

Advertisement

ఈ విమానంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు సహా మొత్తం 180 మంది ప్రయాణికులు ఉన్నారు. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి, సమస్యను అధిగమించి విమానాన్ని విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులంతా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అధికారుల సమయస్ఫూర్తి వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని అందరూ ఉపశమనం వ్యక్తం చేశారు.

Also Read: ఒకే ఫార్ములా.. ఇద్దరు నేతలు.. ఒకరిది జైలు, ఇంకొకరిది సెటిల్‌మెంట్!

Tags

Related News

ట్రోలర్స్ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి..చిరు శ్రీకాంత్ సినిమా నాని పై అప్డేట్!

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

కొడుకు బతకాలంటే రూ. 26 కోట్లు కావాలి.. దాతలు ముందడుగు వేస్తే, కాటేసిన సైబర్ రాక్షసులు!

Intinti Ramayanam Today Episode: బాబు కిడ్నాప్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. అవని ప్లాన్ సూపర్..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమను ఇరికించిన భద్ర.. వల్లికి దిమ్మతిరిగే షాక్.. ఇది కదా ఫ్యాన్స్ కోరుకొనేది..

Karthika Deepam 2 Serial Today Episode September 18th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: శివనారాయణను దొంగగా బావించిన ఆలయ ధర్మకర్త          

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. ఇదేం ట్విస్ట్ రా అయ్యా..

ఆయనో భూస్వామి..నువ్వో పెయింటర్‌.. రా భూముల లెక్కలు తేల్చుకుందాం..! కేటీఆర్‌ వీరావేశం..

Big Stories

Advertisement
×