E-Paper
Advertisement

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!
Advertisement

Peddi Movie:ఏ సినిమాలో అయినా సరే నటీనటులు ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా నటించగలిగితే.. సమాజంలో వారికి ఎలాంటి సందర్భాలు ఎదురవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ రాముడు, కృష్ణుడు, సీతాదేవి వంటి పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటే.. నిజంగా ఆయా పాత్రలలో నటించిన నటీనటులు బయటకు వెళ్తే.. వారికి ప్రజలు బ్రహ్మరథం పడతారు. ఒకవేళ సినిమాలో హీరో క్యారెక్టర్ ను అమితంగా అభిమానించే ప్రేక్షకుడు.. హీరోని విలన్ ఇబ్బంది పెడితే.. అదే విలన్ పాత్ర పోషించిన నటుడు బయట కనిపిస్తే ఊరుకుంటారా? కొట్టడానికి కూడా వెనుకాడరు.. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సదరు విలన్ పాత్రలు పోషించిన నటులపై బండ బూతులు తిడుతూ రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మెగా అభిమానుల నుంచి పెద్ది సినిమా నటుడికి ఇలాంటి బెదిరింపు మెసేజ్ లు ఎదుర్కోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

పెద్ది సినిమాలో తారక్ పొన్నప్ప..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా, బుచ్చిబాబు సనా (Bucchibabu Sana) దర్శకత్వంలో తెరకెక్కిన రూరల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ పెద్ది (Peddi ). ఈ ఏడాది జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా.. జగపతిబాబు(Jagapathi Babu), శివరాజ్ కుమార్(Siva Raj Kumar) , బోమన్ ఇరానీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అయితే తాజాగా ‘అనకాపల్లి’ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న పెద్ది సినిమా విలన్ తారక్ పొన్నప్ప(Tarak ponnappa) తాజాగా మెగా అభిమానుల నుండి తాను ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు.

తారక్ పొన్నప్పపై మెగా అభిమానులు మాటల దాడి..

Advertisement

పెద్ది సినిమాలో వీరభద్రుడు పాత్రలో కనిపించారు తారక్ పొన్నప్ప. ఈ కథలో రామ్ చరణ్ కి గట్టి ప్రత్యర్థిగా నిలుస్తాడు. ముఖ్యంగా సినిమాలో పెద్ది కాలు విరగ్గొట్టే కీలకమైన పాత్ర పోషించాడు. ఈ సన్నివేశమే ఇప్పుడు నిజ జీవితంలో కూడా తనకు ఇబ్బందులు తెచ్చిపెడుతోందని తారక్ వెల్లడించారు. ప్రతిరోజు ఇంస్టాగ్రామ్ లో నాకు వందలాది మెసేజ్లు వస్తుంటాయి.” మా పెద్ది కాలు ఎందుకు విరగొట్టావ్?”, ” రామ్ చరణ్ కు ఎందుకు అలా చేసావ్?”అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే మరికొంతమంది సరదాగా కామెంట్ చేస్తున్నారు. కానీ మరికొంతమంది చాలా దారుణంగా బూతులు తిడుతున్నారు. ఒక్కొక్కసారి కామెంట్లు చదవడానికి కూడా ఇబ్బందిగా ఉంటున్నాయి. పైగా వాటిని నేను డిలీట్ కూడా చేస్తున్నాను. అది కేవలం సినిమాలో పాత్ర మాత్రమే అని ఎంత చెప్పినా కొంతమంది వినడం లేదు. అసభ్యకర పదజాలంతో దూషిస్తున్నారు అంటూ తారక్ పొన్నప్ప ఆవేదన వ్యక్తం చేశారు.

Also read: డైలాగ్ చేంజెస్ తో సెన్సార్ పూర్తి చేసుకున్న కొరియన్ కనకరాజు.. రన్ టైమ్ లాక్!

ఆవేదన వ్యక్తం చేస్తున్న తారక్ పొన్నప్ప..

Advertisement

ఇకపోతే అభిమానులు ఎలా ఎంత దారుణంగా ఉన్నారు అంటే సోషల్ మీడియా వరకే ఆగిపోకుండా రోడ్డుమీద కనిపిస్తే నీ అంతు చూస్తాం అంటూ బెదిరింపు కామెంట్లు చేస్తున్నారు అంటూ తారక్ పొన్నప్ప తన బాధను వెళ్ళబుచ్చుకున్నారు. మరి ఈ విషయాలు రాంచరణ్ వరకు వెళ్తే ఆయన ఎలా స్పందిస్తారో తెలియదు కానీ మెగా అభిమానుల దాటికి తారక్ పొన్నప్ప మాత్రం భారీగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు.

Related News

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమను ఇరికించిన భద్ర.. వల్లికి దిమ్మతిరిగే షాక్.. ఇది కదా ఫ్యాన్స్ కోరుకొనేది..

Karthika Deepam 2 Serial Today Episode September 18th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: శివనారాయణను దొంగగా బావించిన ఆలయ ధర్మకర్త          

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. ఇదేం ట్విస్ట్ రా అయ్యా..

ఆయనో భూస్వామి..నువ్వో పెయింటర్‌.. రా భూముల లెక్కలు తేల్చుకుందాం..! కేటీఆర్‌ వీరావేశం..

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్.. ఐఫోన్ ధరలు తగ్గుతాయా? లేక షాక్ ఇస్తాయా? పూర్తి విశ్లేషణ!

Karthika Deepam 2 Serial Today Episode September 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: హాస్పిటల్ లో దీప – ఇంట్లోంచి గెంటివేయబడ్డ శివనారాయణ          

జైల్లో ప్రజ్వల్ రేవణ్ణ లీలలు.. ఫోన్ ఓపెన్ చేసి చూసిన అధికారులకు మైండ్ బ్లాక్!

Illu Illalu Pillalu Today Episodes: తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేధవతికి మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

Big Stories

Advertisement
×