BigTV English

Science Centre:దేశంలోనే మొదటి సైన్స్ సెంటర్ ఏర్పాటు..

Science Centre:దేశంలోనే మొదటి సైన్స్ సెంటర్ ఏర్పాటు..

Science Centre:చిన్నప్పటి నుండే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆసక్తి పెంచడం వల్ల.. పెద్దయ్యాక వారు ఆ విభాగంలో ఉన్నతస్థాయికి చేరడానికి ఉపయోగపడుతుంది. అందుకే ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి ప్రోత్సహిస్తున్నారు. పరిశోధకులు కూడా చిన్నపిల్లలకు సైన్స్ విషయంలో ఆసక్తి కలిగించే విధంగా ప్రాజెక్ట్స్‌ను చేస్తున్నారు. తాజాగా అలాంటి ఒకటి ప్రాజెక్ట్ కోయంబత్తూరులో ప్రారంభమయ్యింది.


ఇప్పటికే తమిళనాడులో పిల్లల కోసం ప్రత్యేకంగా మూన్ ఫెస్టివల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంతోమంది పిల్లలకు దీని ద్వారా చంద్రుడి గురించి, ఆస్ట్రానమీ గురించి తెలుసుకునే అవకాశం లభిస్తోంది. దీనికి వచ్చిన రెస్పాన్స్‌కు దృష్టిలో పెట్టుకొని తమిళనాడు ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి సాయంగా నిలబడనుంది. కోయంబత్తూరులోని జీడీ నాయుడు చారిటీస్.. ఒక సైన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.

ఈ సైన్స్ సెంటర్ ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పిల్లలకు ఆసక్తి పెంచడమే లక్ష్యంగా స్థాపించబడింది. ప్రాక్టికల్‌గా సైన్స్‌లో జరిగే ఎన్నో విషయాలను తెలుసుకోవడానికి ఈ సెంటర్ ఉపయోగపడుతుంది. ఈ సైన్స్ సెంటర్‌కు ‘ఎక్స్‌పిరిమెంటా’ అనే పేరు కూడా పెట్టారు. ఇప్పటికే ఈ సైన్స్ సెంటర్‌కు సంబంధించిన నిర్మాణం అంతా పూర్తయ్యింది. ఫిబ్రవరి 28న తమిళనాడు ఫైనాన్స్ అండ్ హ్యూమన్ రీసౌర్స్ మ్యానేజ్మెంట్ మినిస్టర్ పలనివేళ్ల త్యాగరాజన్ చేతుల మీదుగా ఎక్స్‌పిరిమెంటా ప్రారంభం కానుంది.


ఈ సైన్స్ సెంటర్‌లో 120కు పైగా సైన్స్‌కు సంబంధించిన వస్తువులు ప్రదర్శనకు ఉంచబడతాయి. ముఖ్యంగా విద్యార్థులకు సైన్స్ గురించి తెలియడమే లక్ష్యంగా సైన్స్ సెంటర్ స్థాపన జరిగింది. అందుకే ఇందులోని వస్తువులను చేతితో తాకడానికి కూడా అనుమతించనున్నారు. 1950లో జీడీ నాయుడు పేరు మీదుగా ఈ చారిటీస్ ఏర్పాటయ్యాయి. ఇప్పటికే ఆయన పేరు మీద ఎన్నో మ్యూజియంలు కూడా ఏర్పాటయ్యాయి. అంతే కాకుండా ఇప్పటివరకు భారత్‌లో ఇలాంటి ఒక సైన్స్ సెంటర్ ఏర్పాటవ్వలేదని, ఇదే మొదటిది అని తమిళనాడు ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేస్తుంది.

Vaccine For Covid:కోవిడ్‌కు కొత్త వ్యాక్సిన్.. మరింత మెరుగ్గా..

Vehicle Headlights:హెడ్‌లైట్స్ వల్ల కళ్లకు ప్రమాదమా..? నిపుణుల రిపోర్ట్..

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×