BigTV English

Forest Bathing:ట్రెండ్ సృష్టిస్తున్న ఫారెస్ట్ బాతింగ్.. వృద్ధుల కోసం..

Forest Bathing:ట్రెండ్ సృష్టిస్తున్న ఫారెస్ట్ బాతింగ్.. వృద్ధుల కోసం..

Forest Bathing:శారీరికంగా మాత్రమే కాదు మానసికంగా కూడా ఆరోగ్యం అనేది ముఖ్యమే. దాని వెనుక ఎంతో సైన్స్ కూడా ఉంది. ఈరోజుల్లో శరీర వ్యాధులతో బాధపడుతున్న వారు ఎంతమంది ఉన్నారో.. మానసికంగా కూడా ఆరోగ్య సమస్యలు ఎదుర్కుంటున్న వారు కూడా అంతేమంది ఉన్నారు. ముఖ్యంగా వృద్ధుల్లో ఈ రెండు సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి వారికి దూరంగా ఉండడానికి పరిశోధకులు కొన్ని సలహాలు ఇస్తున్నారు.


పర్యావరణం అనేది ఎవరి మనసును అయినా ప్రశాంతంగా మారేలా చేస్తుంది. ముఖ్యంగా 65 ఏళ్ల వయసు పైబడిన వారు పర్యావరణంలో, పచ్చదనంలో సమయం కేటాయించడం వల్ల మానసికంగానే కాకుండా శారీరికంగా కూడా లాభాలు కలుగుతాయని రీసెర్చ్‌లో తేలింది. తైవాన్‌కు చెందిన శాస్త్రవేత్తలు.. ప్రకృతితో సమయం గడుపుతున్న కొందరు వృద్ధుల మానసిక స్థితిని స్టడీ చేశారు. దీని ద్వారానే వారి ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు లైఫ్ క్వాలిటీ కూడా బాగుంటుందని గుర్తించారు.

ఇప్పటికే ప్రకృతిలో సమయం గడపడానికి ఎన్నో యాక్టివిటీస్ ఏర్పడ్డాయి. అందులో ఒకటి ఫారెస్ట్ బాతింగ్. అంటే అడవిలో సమయం గడపడం. స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించడం, అడవి వాసనను లోపలికి తీసుకోవడం, అక్కడి శబ్దాలను వినడం, అనుభూతిని పొందడం.. ఇలాంటి ఫారెస్ట్ బాతింగ్‌లో భాగమే. హైకింగ్‌లాంటివి చేయడం వృద్ధులకు చాలా కష్టం. అందుకే దానికి బదులుగా ఫారెస్ట్ బాతింగ్ కూడా అలాంటి రిజల్టే ఇస్తుందని పరిశోధకులు అంటున్నారు.


జపాన్, తైవాన్, చైనా వంటి దేశాల్లో ప్రారంభమయిన ఈ ఫారెస్ట్ బాతింగ్ ప్రక్రియ.. ఇప్పుడు అమెరికాలో కూడా పాపులర్ అవుతోంది. అందుకే తైవాన్‌లోని క్జిటో ఎడ్యుకేషన్ ఏరియాకు వచ్చే వృద్ధులను రీసెర్చ్ కోసం ఎంపిక చేశారు. 2022లో ఈచోటికి తరచుగా వచ్చే దాదాపు 292 మందిని వారు స్టడీ చేశారు. పరిశోధకులు అడిగిన పలు ప్రశ్నలకు వారు సమాధానాలిచ్చారు. అడవి వల్ల వారు పొందుతున్న అనుభూతిని ఇతరులతో పంచుకున్న వారికి ఫారెస్ట్ బాతింగ్ వల్ల ఎక్కువ లాభాలు కలిగాయని వారు గుర్తించారు.

Vaccine For Covid:కోవిడ్‌కు కొత్త వ్యాక్సిన్.. మరింత మెరుగ్గా..

Lay Off Robots:రోబోలకు కూడా లేఆఫ్ తాకిడి.. గూగుల్ నిర్ణయం..

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×