BigTV English

ChatGPT:విమానం ఆలస్యం.. చాట్‌జీపీటీ ఏమందంటే?

ChatGPT:విమానం ఆలస్యం.. చాట్‌జీపీటీ ఏమందంటే?

ChatGPT:విమానాల్లో తరచూ ప్రయాణించే వాళ్లు… కొన్నిసార్లు అవి ఆలస్యం కావడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. తాజాగా అలాంటి ఇబ్బందినే ఎదుర్కొన్న ఓ మహిళ… దానిపై విమానయాన సంస్థకు ఓ ఈ-మెయిల్ రాయమని చాట్‌జీపీటీని అడిగింది. విమానం ఆలస్యం కావడాన్ని నిరసిస్తూ… చాలా పద్ధతిగా, మర్యాదగా క్షణాల్లో ఈ-మెయిల్ రాసిచ్చింది… చాట్‌జీపీటీ. చాట్‌బాట్‌లో ఈ-మెయిల్ కంపోజ్ అవుతున్న వీడియోను ఆ మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో… అది కాస్తా వైరల్ అయింది. ఇప్పటికే 20 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఆ వీడియో చూసిన వాళ్లలో చాలా మంది… చాట్‌జీపీటీ అద్భుతమని కొనియాడుతున్నారు.


చెరీ లువో అనే మహిళ తన విమానం 6 గంటలు ఆలస్యం కావడంతో… ఆ అంశంపై విమానయాన సంస్థకు నిరసన తెలియజేయాలనుకుంది. వెంటనే చాట్‌జీపీటీ ఓపెన్ చేసి… తన పరిస్థితిని వివరిస్తూ… చాలా ఘాటుగా, మర్యాదపూర్వకంగా ఈ-మెయిల్ రాయమని అభ్యర్థించింది. ఆమె విజ్ఞప్తి మేరకు… చాట్‌జీపీటీ క్షణాల్లో ఈ-మెయిల్ రాసిచ్చింది. అందులో ఏముందంటే..

”మీ విమానయాన సంస్థకు చెందిన విమానంలో నా ప్రయాణం సందర్భంగా నేను పడ్డ బాధను వ్యక్తం చేసేందుకు ఈ ఈ-మెయిల్ రాస్తున్నాను. విమాన సర్వీసు 6 గంటలు ఎందుకు ఆలస్యం అయిందన్న అంశంపై మీ సిబ్బంది నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో, నాతో పాటు ఇతర ప్రయాణికులు చాలా అసౌకర్యానికి గురయ్యారు. అసలు ఏం జరుగుతుందో? మేం ఎప్పుడు బయలుదేరతామో? కూడా ఎవరూ చెప్పకపోవడంతో… అందరం చీకట్లో ఉన్నట్లు ఉంది. ప్రాధాన్యతా పాస్ కలిగి ఉండి, 3 గంటలకు పైగా వెయిట్‌లిస్ట్‌లో ఉన్నప్పటికీ… నేను లాంజ్ యాక్సెస్ చేయలేకపోయాను. ఇది మరీ అసౌకర్యానికి గురిచేసింది. ఊహించని పరిణామాల కారణంగా విమానం ఆలస్యమైందని మేము అర్థం చేసుకున్నాం. కానీ, మీరు చేసిన వాగ్దానం మేరకు లాంజ్ సౌకర్యం కల్పించకపోవడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా ప్రయాణికులకు సరైన ప్రాధాన్యతనిచ్చి మెరుగైన సేవలు అందిస్తారని ఆశిస్తున్నాను”.


అడిగిన వెంటనే చాట్‌జీపీటీ ఇలా ఈ-మెయిల్ కంపోజ్ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న చెరీ లువో… ఇదీ మన భవిష్యత్తు. చాట్‌జీపీటీ ద్వారా ఏయే ఉద్యోగాలు భర్తీ చేయబడతాయి? అనే క్యాప్షన్ జత చేసింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు… ఇదో అద్భుతమని, చాట్‌జీపీటీ చాలా తెలివైనదని ప్రశంసిస్తున్నారు. మరికొందరు… చాట్‌జీపీటీ ఎంత ఆశ్చర్యపరుస్తుందో, అంత భయపెడుతుంది కూడా అని చెప్పుకొచ్చారు. ఇక ఐబీఎం కంపెనీ చీఫ్ అయితే… చాట్‌జీపీటీ “క్లెరికల్ వైట్ కాలర్ వర్క్”ని భర్తీ చేస్తుందని వ్యాఖ్యానించారు.

Gold Rates : ఈ రోజు బంగారం ధరలు ఎంత తగ్గాయో తెలుసా..?

Air India:ఏడాదికి రూ.2 కోట్లకు పైగా జీతం.. ఎవరికంటే?

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×