BigTV English

MIM : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు మద్దతు.. కేసీఆర్ వ్యూహం ఇదేనా..?

MIM : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు మద్దతు.. కేసీఆర్ వ్యూహం ఇదేనా..?

MIM : ఎంఐఎంను మచ్చిక చేసుకునేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోందా? ఆ పార్టీతో స్నేహమే మంచిదనుకుంటుందా? మజ్లిస్ వ్యతిరేకమైతే గులాబీ పార్టీకి నష్టం తప్పదా? అందుకే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకి మద్ద ఇచ్చిందా ? అంటే అవుననే సమాధానమే వస్తోంది.


తెలంగాణలో పార్టీని విస్తరించాలని మజ్లిస్ భావిస్తోంది. ఇప్పటి వరకు పాత బస్తీకే ఆ పార్టీ పరిమితమైంది. మహారాష్ట్ర, బిహార్, ఉత్తర్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లోనూ పోటీ చేసినా తెలంగాణలో మాత్రం హైదరాబాద్ ఓల్డ్ సిటీ దాటి బయటకు రాలేదు. కానీ ఇప్పుడు మజ్లిస్ గాలిపటాన్ని తెలంగాణ వ్యాప్తంగా ఎగురవేయాలని సంకల్పిస్తోంది. వచ్చే ఎన్నికల్లో 50 చోట్ల పోటీ చేయడానికి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. కనీసం 15 స్థానాల్లో గెలవాలన్న పట్టుదలతో ఎంఐఎం ఉంది. అందుకోసం అభ్యర్థుల అన్వేషణ మొదలుపెట్టింది. ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ముస్లింయేతరులను కూడా పోటీకి దించనుందని తెలుస్తోంది. బీసీ, ఎస్సీ అభ్యర్థులను ఎక్కువగా బరిలోకి దించాలని భావిస్తోంది. కొన్ని స్థానాల్లో హిందూ అభ్యర్థులను పోటీకి దించే యోచన చేస్తోంది. ఇలా ఎంఐఎం బహుముఖ వ్యూహంతో సెక్యులర్ పార్టీలా ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది.

కేసీఆర్ వ్యూహమిదేనా..!
అటు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థికి మద్దతివ్వాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. మిత్రపక్షం మజ్లిస్‌ చేసిన అభ్యర్థనతో మద్దతు ప్రకటిస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలోని సీనియర్లతో చర్చించిన తర్వాత హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో మజ్లిస్ అభ్యర్థికి మద్ధతు ఇవ్వాలని నిర్ణయించారు. వచ్చే నెల 13న హైదరాబాద్‌ స్థానిక సంస్థల స్థానంతోపాటు హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.


ఇలా మజ్లిస్ కోరగానే కేసీఆర్ వెంటనే మద్దతు ఇవ్వడం వెనుక పక్కా రాజకీయం వ్యూహం ఉందని తెలుస్తోంది. పార్టీ విస్తరణపై దృష్టి పెట్టిన మజ్లిస్ కు చెక్ పెట్టేందుకు కేసీఆర్ అడుగులు వేశారని అంటున్నారు. ఎందుకంటే మజ్లిస్ పోటీ చేస్తే అన్ని పార్టీల కంటే బీఆర్ఎస్ కే ఎక్కువ నష్టం కలుగుతుంది. చాలా నియోజకవర్గాల్లో ముస్లింల ఓట్లు అటు కాంగ్రెస్ గానీ, ఇటు బీఆర్ఎస్ గానీ పడతాయి. మజ్లిస్ రంగంలోకి దిగితే బీఆర్ఎస్ ఓట్లకే ఎక్కువగా గండిపడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ది సంప్రదాయ ఓటు బ్యాంకు. అందుకే గులాబీలో గుబులు రేగుతోంది.

అసెంబ్లీలో వార్..పెరిగిన దూరం..
అసెంబ్లీలో ఎంఐఎం శాసససభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ -కేటీఆర్ మధ్య జరిగిన మాటల యుద్ధం బీఆర్ఎస్-ఎంఐఎం మధ్య దూరాన్ని పెంచింది. ఏడుగురు ఎమ్మెల్యేలున్న పార్టీకి అసెంబ్లీలో ఎక్కువ సమయం కేటాయించలేమని కేటీఆర్ అనడంపై అక్బర్ ఆ రోజే ఫైర్ అయ్యారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పాతబస్తీ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో 15 మంది సభ్యులతో సభలో అడుగుపెడతామని ఛాలెంజ్ చేశారు. ఆ వెంటనే కార్యాచరణ సిద్ధం చేశారు. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ అలెర్ట్ అయ్యింది. ఎమ్మెల్సీ ఎన్నికలను అవకాశంగా తీసుకుంది. ఎంఐఎంను మచ్చిక చేసుకునే పనిలో పడింది. అయినా సరే ఎంఐఎం ఎక్కువ స్థానాల్లో పోటీకి దిగాలనే భావిస్తే.. బీఆర్ఎస్ పొత్తుపెట్టుకుంటుందా..?

Hyderabad : వీధి కుక్కల దాడి.. 4 ఏళ్ల బాలుడు బలి..

Gang Rape : మహిళ కిడ్నాప్.. కారులో గ్యాంగ్ రేప్.. హైదరాబాద్‌లో దారుణం..

Related News

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Kakani Govardhan Reddy: జైలు జీవితం కాకాణిని మార్చేసిందా?

Big Stories

×