E-Paper
Advertisement

Flowers : ఇవాళ కోసిన పువ్వులు రేపు వాడొచ్చా…?

Flowers : ఇవాళ కోసిన పువ్వులు రేపు వాడొచ్చా…?
Advertisement

Flowers : భగవంతుని పూజ కోసం వాడిన పువ్వులు మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. ముఖ్యంగా మన ఇంట్లో పూసిన మొక్క నుంచి కోస్తే ఆ ఆనందం మరీ ఎక్కువ. అయితే పువ్వులైనా మరో దానికైతే సరే దేనికైనా ఒక పరిమితి ఉంటుంది. ఆ కాలపరిమితి వరకు అవి పనిచేస్తాయి. ఆ వేళ వరకు అవి పనికి వస్తాయి. ఒక రాత్రి గడిస్తే ఆ పుష్పాలు నిర్మాల్య పుష్పాలుగా అవుతాయి. నిర్మాల్య దోషాన్ని పొందిన పువ్వులు తెల్లవారజాము ముందే అంటే సూర్యోదయం ముందే వాటిని తొలగించాలి.అలా చేయని పక్షంలో అసుర శక్తులు అందులోకి ప్రవేశిస్తుంటాయి. వాటికవే రాక్షస పూజ చేసుకుంటాయి.

స్వామికి పూజలు చేసిన పువ్వులను, నిర్మాల్యాన్ని ఎవరూ తొక్కకూడదు. ఎక్కడపడితే వాటిని పడేయకూడదు. నలుగురు తిరిగే చోట అసలు వేయకూడదు. అలాగే చెత్త డబ్బాల్లోను దేవుడికి పూజ చేసిన పువ్వులు విసిరేయరాదు. పువ్వులు సహజంగా భూమి నుంచి పుట్టిన మొక్క నుంచి వచ్చినవి. వాటిని మొక్కల్లో వేస్తే అవి భూమిని శుద్ధి చేస్తాయి.

Advertisement

ఒక గుంత తీసి అందులో పెట్టడం లేదా..ఎవరూ తొక్కని, నడవని ప్రాంతంలో వేస్తే అవి భూమిలో కలిసిపోతాయి. అలాగే ప్రవహించే నదుల్లో కానీ, బావుల్లో కాని దేవుడికి వినియోగించిన వాటితోపాటు వినియోగం లేని పూలు కూడా వేయచ్చు. పూలు నీళ్లల్లో వేయడం వల్ల ఆనీళ్లు కలుషితం కాదు. ఆ పువ్వులను నీళ్లో ఉండే జలచరాలు ఉపయోగించుకుంటాయి. ఇలా వాడేసిన పువ్వులు జలాల్లో కానీ, మట్టిలో కప్పి ఉంచడం వల్ల సమాజానికి మంచే జరుగుతుంది.

ఇంట్లో దేవుడి ఫోటోల‌కు కానీ, పెద్ద వారి ఫోటోల‌కు కానీ ప్లాస్టిక్ పూల మాల‌ల‌ను అస్స‌లు వేయ‌కూడ‌దు. ప్లాస్టిక్ పువ్వుల‌ను కూడా పెట్టకూడ‌దు. ఎప్ప‌టిక‌ప్పుడు తాజా పువ్వుల‌ను మాత్ర‌మే పెట్టాలి. ప్లాస్టిక్ పువ్వుల‌ను, పూల దండ‌లను వేయ‌డం వ‌ల్ల అరిష్టం వాటిల్లుతుంద‌ని పండితులు చెబుతున్నారు. అలాగే కాగిత‌పు పువ్వులను కానీ, దండ‌ల‌ను కానీ ఎటువంటి ఫోటోల‌కు వేయ‌కూడ‌దు.

Advertisement

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×