Frog Sounds : కప్పలు.. అందరం చూసే ఉంటాం. అవి చేసే బెక బెక శబ్ధాలు వినే ఉంటాం. కాలువల్లో, చెరువుల్లో, నీరు నిల్వున్న చోట ఇవి ఎక్కువగా జీవిస్తాయి. ఇక వర్షాకాలంలో అయితే ఈ శబ్ధాల తీవ్రత అధికంగా ఉంటుంది. మీకు తెలుసా ఈ శబ్ధాలు వెనుక చాలా పెద్ద కథే ఉందని..? భూమిపై జీవించే ప్రతి జీవి జాతిలోనూ శృంగారం ఉంటుంది. శృంగారం కోసం అవి ప్రత్యేకమైన ప్రత్యేకమైన శబ్ధాలను చేస్తాయి. జంటను వెతుక్కునేందుకు అనేక రకాల విధానాలను పాటిస్తాయట. మనం వినే కప్పల శబ్ధాలు కూడా ఇటువంటివే..!
Frog Sounds : కప్పలు.. అందరం చూసే ఉంటాం. అవి చేసే బెక బెక శబ్ధాలు వినే ఉంటాం. కాలువల్లో, చెరువుల్లో, నీరు నిల్వున్న చోట ఇవి ఎక్కువగా జీవిస్తాయి. ఇక వర్షాకాలంలో అయితే ఈ శబ్ధాల తీవ్రత అధికంగా ఉంటుంది. మీకు తెలుసా ఈ శబ్ధాలు వెనుక చాలా పెద్ద కథే ఉందని..? భూమిపై జీవించే ప్రతి జీవ జాతిలోనూ శృంగారం ఉంటుంది. శృంగారం కోసం అవి ప్రత్యేకమైన ప్రత్యేకమైన శబ్ధాలను చేస్తాయి. జంటను వెతుక్కునేందుకు అనేక రకాల విధానాలను పాటిస్తాయట. మనం వినే కప్పల శబ్దాలు కూడా ఇటువంటివే..!
“ది అట్లాంటిక్” నివేదిక ప్రకారం.. మగ కప్పలు ఆడ కప్పలను ఆకర్షించేందుకు కొన్ని రకాల భారీ శబ్ధాలు చేస్తాయి. ఈ క్రమంలో అవి చేసే శబ్దాల తీవ్రతను ఆడ కప్పలు తగ్గించుకుంటాయని తాజా పరిశోధన చెబుతోంది. మగ కప్పల శబ్దాలను ఆడ కప్పల ఊపిరితిత్తులు తగ్గిస్తాయని పరిశోధకులు కనుగొన్నారు. వాటి ఊపిరితిత్తులకు ఈ శక్తి సహజ సిద్ధంగానే ఉంటుందన్నారు.
కప్పులు చేసే శబ్ధాల తీవ్రత కొన్నిసార్లు 100 డెసిబుల్స్ కంటే ఎక్కువ తీవ్రత ఉంటాయి. జతకట్టే సమయంలో తమ జాతికి చెందిన ఆడ కప్పలను ఆకర్షించేందుకు మగ కప్పలు ఈ భారీ శబ్దాలు చేస్తాయి. వీటి వల్ల మనుషుల్లో వినికిడి సమస్యలు కూడా రావచ్చు. అయితే ఈ శబ్దాల తీవ్రతను ఆడ కప్పల ఊపిరితిత్తులు గ్రహించడంతో వాటి తీవ్రతను తగ్గించుకుంటాయట.
మిన్నెసోటాలోని సెయింట్ ఓలాఫ్ కాలేజీకి చెందిన నార్మన్ లీ ఆధ్వర్యంలో చేసిన పరిశోధన ప్రకారం.. ఆడ కప్పల ఊపిరితిత్తులు వాటి కర్ణభేరిపై సున్నితత్వాన్ని తగ్గిస్తాయి. ఇవి ఇతర జాతుల కప్పలు చేసే శబ్దాల ప్రభావాన్ని, బ్యాక్ గ్రౌండ్ నాయిస్‌ను తగ్గించుకుంటూ.. తమ జాతి కప్పల శబ్దాలను గుర్తిస్తాయి. ఈ ప్రక్రియను ‘స్పెక్ట్రల్ కాంట్రాస్ట్ ఎన్‌హ్యాన్స్‌మెంట్’ అంటారని లీ తెలిపారు.
ఆడ కప్పల ఊపిరితిత్తులు నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్లుగా పనిచేస్తాయి. మగ కప్పలు చేసే శబ్దాల స్పెక్ట్రమ్‌లోని ఫ్రీక్వెన్సీని తగ్గించుకుని తమ జాతి కప్పల ఫ్రీక్వెన్సీని తెలుసుకుంటాయని పరిశోధనల్లో కనుకొన్నారు. చాలా జాతుల కప్పల్లో పునరుత్పత్తికి ఇలాంటి శబ్దాలే మూలమని గుర్తించారు.